యువతను ప్రోత్సహించడంలో ప్రభుత్వం ముందంజ..

19
Minister Botsa

యువతను ప్రోత్సహించడంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ముందంజలో ఉంటుందనీ అనంతపురం జిల్లా ఇంచర్జ్ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. పుట్టపర్తిలో జరిగిన వైఎస్ఆర్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. గ్రామీణ ప్రాంత క్రీడాకారులలో నైపుణ్యం వెలికితీసేందుకు దుద్దుకుంట ఫౌండేషన్ వైఎస్సార్ మెమోరియల్ టోర్నీ నిర్వహించడం అభినందనీయం అన్నారు.

ప్రశాంతి గ్రామ మైదానంలో ముగిసిన వైఎస్సార్ మెమోరియల్ క్రికెట్ టోర్నీ ఫైనల్ మ్యాచ్,విజేత బుక్కపట్నం అగ్రహారం జట్టుకు ట్రోఫితో పాటు 2.5 లక్షలు,రన్నర్ పుట్టపర్తి గోకులం జట్టుకు ట్రోఫితో పాటు 1.25 లక్షల చెక్కును మంత్రి బొత్స సత్యనారాయణ అందజేచేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దుద్దకుంట శ్రీధర్ రెడ్డి, విప్ కాపు రామచంద్రా రెడ్డి, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి జడ్పీ చైర్మన్ గిరిజమ్మ, ఎంపీ గోరంట్ల మాధవ్ తదితరులు పాల్గొన్నారు.