ఏపీ స్ధానికసంస్థల పోలింగ్ అప్‌డేట్…

108
ap localbody polling
- Advertisement -

ఏపీ స్ధానిక సంస్థల ఎన్నికల పోలింగ్ మొదలైంది. విజయనగరం మినహా 12 జిల్లాల్లో పోలింగ్‌ జరుగుతుండగా మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్‌ జరుగనుంది. సాయంత్రం 4 గంటలకు కౌంటింగ్‌ చేపట్టి, విజేతలను ప్రకటించనున్నారు. నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల్లో ఉదయం మధ్యాహ్నం 1.30 వరకే పోలింగ్‌ కొనసాగనుంది.

రాష్ట్రంలో తొలిదశ ఎన్నికల్లో 3,458 సమస్యాత్మక, 3,594 అత్యంత సమస్యాత్మక పోలింగ్‌ స్టేషన్లు అధికారులు గుర్తించారు. మొదటి విడతలో 2,723 సర్పంచ్‌ స్థానాలకు, 20,157 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. సర్పంచ్‌ బరిలో 7,506 మంది, వార్డులకు 43,601 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

తొలిదశలో 3,249 గ్రామ పంచాయతీల్లో 525 సర్పంచ్‌ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. నెల్లూరు జిల్లా వెలిచర్లలో సర్పంచ్‌ పదవికి ఒక్క నామినేషన్‌ కూడా దాఖలు కాకపోవడంతో ఆ గ్రామంలో సర్పంచ్‌ ఎన్నికను వాయిదా వేశారు. 2,723 సర్పంచ్‌ స్థానాలకు 7506 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని తెలిపారు. అలాగే, 32,502 వార్డు సభ్యులకు గాను 12,815 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. 160 వార్డు స్థానాలకు అసలు నామినేషన్లు రాలేదు.

- Advertisement -