ఎస్వీబీసీ చైర్మన్ గా ఢమరుకం దర్శకుడు?

372
Director Srinivas Reddy
- Advertisement -

ప్రముఖ నటుడు పృధ్వీ ఎస్వీబీసీ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. టీటీడీ మహిళా ఉద్యోగితో ఫోన్ లో అసభ్యపదజాలంలో మాట్లాడగా..ఆ ఆడియో రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది. దీంతో పృధ్వీపై చర్యలు తీసుకుంది ఏపీ ప్రభుత్వం. ఎస్వీబీసీ ఛైర్మన్ పదవి ఖాళీ కావడంతో ఈపదవిలో ఎవరికి అవకాశం ఇస్తారనే విషయంపై ఆసక్తికరంగా మారింది.

ఎస్వీబీసీ చైర్మన్ గా వైఎస్ రాజశేఖర్ రెడ్డి సన్నిహితుడికి అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. ప్రముఖ దర్శకుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితులు శ్రీనివాస్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది.గత రెండు రోజులుగా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్‌లో జరుగుతున్న వివాదాలపై నేడు టిటిడి చైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. తదుపరి చైర్మన్ గా ఎవరిని నియమించాలన్నదానిపై చర్చ చేస్తున్నారు. శ్రీనివాస్ రెడ్డి ఢమరుకం, కుబేరులు, టాటా బిర్లా మధ్యలో లైలా, రాగల 24 గంటలు వంటి సినిమాలు తీశారు. మరో వైపు ఎస్వీబీసీ చైర్మన్ పదవి రేసులో ప్రముఖ జర్నలిస్ట్ స్వప్న కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం స్వప్న ఎస్వీబీసీ డైరెక్టర్‌గా సేవలు అందిస్తున్నారు. ఈ అంశంపై మరో రెండు రోజుల్లో స్పష్టత రానుందని సమాచారం.

- Advertisement -