ప్ర‌భాస్ ‘జాన్‌’కు కొత్త టైటిల్‌..!

761
prabhas new film
- Advertisement -

బాహుబలి సినిమాతో భారీ పాపులారిటీ తెచ్చుకున్న ప్రభాస్.. ఆ తర్వాత సాహో సినిమా ద్వారా ఆశించిన ఫలితం రాబట్టలేక పోయాడు. దీంతో కాస్త నిరాశ చెందిన యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఆయన తదుపరి సినిమా జాన్‌పై దృష్టి సారించారు. రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసందే.

prabhas

అయితే ప్రభాస్‌ 20వ చిత్రం కొన్నాళ్లుగా జాన్ అనే టైటిల్‌తో ప్ర‌చారం జరిగింది. కానీ ఈ టైటిల్‌ని చిత్ర బృంద ఖరారు చేయకపోయినా అభిమానులు జాన్ టైటిల్‌కే ఫిక్స్ అయ్యారు. అయితే ఇటీవ‌ల జాను అనే టైటిల్‌తో శ‌ర్వానంద్, సమంత నటిస్తున్న చిత్ర ఫ‌స్ట్ లుక్‌ రివీల్ చేశారు.

దీంతో ప్ర‌భాస్ 20వ చిత్ర నిర్మాత‌లు త‌మ సినిమాకి వేరే టైటిల్ పెట్టాల‌ని భావిస్తున్న‌ట్టు తెలుస్తుంది. జాన్ అనే పేరు ఉంచితే ప్రేక్ష‌కులు అయోమ‌యానికి గురయ్యే ఛాన్స్ ఉన్న నేప‌థ్యంలో చిత్ర యూనిట్ మ‌రో ఇంట్రెస్టింగ్ టైటిల్ కోసం సెర్చ్ చేస్తున్న‌ట్టుగా తెలుస్తుంది.

- Advertisement -