టీటీడీ పాలకమండలి ఇదే…

131
yv
- Advertisement -

తిరుమల తిరుపతి దేవస్థానం నూతన పాలకమండలిని ఏర్పాటుచేసింది ప్రభుత్వం. 25 మందితో కొత్త పాలకమండలిని ఏర్పాటుచేయగా పాలకమండలిలో కొత్త వారికే ఎక్కువ అవకాశం కల్పించినట్టు టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి తెలిపారు. గత పాలక వర్గంలో మొత్తం 36 మంది సభ్యులు ఉండగా అందులో 24 మంది పాలకమండలి సభ్యులు, 8మందికి ప్రత్యేక ఆహ్వానితులుగా అవకాశం కల్పించారు. ప్రత్యేక ఆహ్వానితులకు ఎలాంటి అధికారాలు ఉండవని స్పష్టం చేశారు.

ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్రకు చెందిన 25మందికి బోర్డులో సభ్యత్వం లభించింది. ఎక్స్‌ అఫిషియో సభ్యులుగా వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి,భూమన కరుణాకర్‌రెడ్డి కొనసాగుతున్నారు. టీటీడీ పాలకమండలిలో మై హోం గ్రూప్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ జూపల్లి రామేశ్వర్‌రావు, హెటిరో పార్థసారథిరెడ్డి, మురంశెట్టి రాములు, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, ముంబైకి చెందిన రాజేశ్ శర్మ, ఇండియా సిమెంట్స్ శ్రీనివాసన్ రెండోసారి సభ్యత్వాన్ని దక్కించుకున్నారు.

గత పాలకమండలిలో 8 మందిగా ఉన్న ప్రత్యేక ఆహ్వానితుల సంఖ్యను ఈ సారి ఏకంగా 50 మందికి అవకాశం కల్పించింది టీటీడీ. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి టీటీడీ ప్రత్యేక ఆహ్వానితులుగా ఉన్నారు.

- Advertisement -