బిగ్ బాస్ 5…సిరిపై నెటిజన్ల ట్రోలింగ్!

86
siri

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 5 తెలుగు విజయవంతంగా 11 ఎపిసోడ్స్ పూర్తిచేసుకుంది. ఇక రెండోవారం కెప్టెన్సీ టాస్క్ కోసం జరుగుతున్న పోటీ ఇంటిసభ్యుల మధ్య మాటల యుద్దమే కాదు కొట్టుకునే వరకు వెళ్లింది.ప్రతి ఒక్క కంటెస్టెంట్ ఎవరో ఒకరితో గొడవ పడి ఇంట్లో రచ్చరచ్చ చేస్తున్నారు. ఇక ముఖ్యంగా ఇప్పటివరకు స్నేహితులుగా ఉన్న సిరి – సన్నీ బద్ద శత్రువులుగా మారిపోయారు.

ముఖ్యంగా సిరి కాస్త ఎక్కువ చేస్తూ నెటిజన్ల ఆగ్రహానికి గురవుతోంది. ఎందుకంటే టాస్క్ సమయంలో సన్నీ తనను అసభ్యకరంగా తాకాడంటూ సిరి ఆరోపించడం,దానిని సన్నీ ఆమె ముందే తాకలేదని చెప్పిన వినకుండా పదేపదే అదే విషయాన్ని ప్రస్తావిస్తూ రోత పుట్టిస్తోంది. సన్నీ ఎదురుపడ్డప్పుడల్లా ఎదోవిధంగా ఆ విషయాన్ని ప్రస్తావనకు తెస్తూ సన్నీకే కాదు ప్రేక్షకులకు విసుగుతెప్పిస్తోంది.

దీంతో బిగ్ బాస్ సీజన్ 2లో భాను, తేజస్విలతో సిరిని పోలుస్తున్నారు నెటిజన్లు. వీరిద్దరు ఆ సీజన్ సమయంలో కౌశల్‌ని ఇలానే బ్లేమ్ చేయడానికి ప్రయత్నించగా చివరికి అదంతా ఉత్తదేనని తేలిపోయింది. ఇక ఆ సీజన్‌లో కౌశల్ విజేతగా కూడా నిలిచారు. ఇప్పుడు సిరి కూడా సన్నీ చేయని దానికి టార్గెట్ చేస్తూ సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తోందని గ్రహించిన నెటిజన్లు ఆమెకు వ్యతిరేకంగా ట్రోల్ చేస్తున్నారు. ఇదంతా సన్నీకి అనుకూలంగా మారడంతో ఆయన మరిన్ని రోజులు బిగ్ హౌస్‌లో ఉండే అవకాశం ఉంది.