బరువెక్కిన అందం…

192
Anushka struggles hard to shed weight!
- Advertisement -

సన్నగా నాజూకుగా సన్నజాజి తీగలా ఉండే స్వీటీ అనుష్క తన ఫాన్స్ కి దిమ్మతిరిగేలా భారీ సైజ్ లో కనిపించి షాక్ ఇచ్చింది. బక్కచిక్కినా బరువెక్కినా అది అనుష్కకే చెల్లింది. అప్పట్లో సైజ్ జీరో కోసం బరువెక్కి … బాహుబలి కోసం సన్నబడిన అది స్వీటికే చెల్లింది. ఇటీవల విడుదల చేసిన బాహుబలి పోస్టర్‌లో సన్నని తీగలా కనబడిన అనుష్క ఇప్పుడు మళ్లీ లడ్డూలా మారిపోయింది.

ఇటీవల ‘షో టైం మూవీ’ ఆడియో లాంచ్‌కు హాజరైంది అనుష్క. ‘బాహుబలి-2’ పోస్టర్‌లో కనిపించిన దానికి విరుద్ధంగా ఆమె ఇంకా బొద్దుగానే ఉంది. దీంతో ‘బాహుబలి-2’ పోస్టర్‌ విషయంలో వినబడిన గాసిప్పులన్నీ నిజమని తేలిపోయింది.

టాలీవుడ్ లో అందగత్తెలకు ఏమాత్రం కొదవ లేకపోయినా అనుష్క లాంటి అందగత్తె మాత్రం అరుదే. తాజాగా సింగం ‘3’ ట్రైలర్స్ లోనూ అనుష్క హెవీగానే కనిపిస్తోంది.  ప్రస్తుతం అనుష్క నటించిన ‘సింగం 3’, బాహుబలి సినిమాలు పూర్తయ్యాయి. ఇక ఈ బ్యూటీ ఒప్పుకున్న సినిమా ‘భాగమతి’ ఒక్కటే. పిల్ల జమీందార్ చిత్ర దర్శకుడు అశోక్ రూపొందిస్తున్న చిత్రమిది. ఈ సినిమాలో ఖులీ కుతుబ్ షా ప్రేయసి భాగమతిగా అనుష్క నటిస్తోంది.  సుల్తాను రాణి పాత్ర కోసం ఇలా ముద్దబంతిలా మారిపోయి ఉంటుందా అంటున్నారు. మొత్తానికి చక్కనమ్మ చిక్కినా అందమే అన్నట్లుగా అనుష్క అడ్డంగా పెరిగినా అందమే అంటున్నారు స్వీటీ ఫ్యాన్స్.

- Advertisement -