మహేష్ కోర్టుకు రావాల్సిందే…

177
Court summons to Mahesh Babu
- Advertisement -

హీరో మహేశ్‌బాబుకు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. తన నవల కాపీ కొట్టి శ్రీమంతుడు సినిమా తీశాడని రచయిత చంద్ర కోర్టును ఆశ్రయించాడు. కేసును విచారణకు స్వీకరించిన కోర్టు మహేశ్ బాబుతో పాటు డైరెక్టర్ కొరటాల, నిర్మాత నవీన్‌లకు సమన్లు జారీ చేసింది. మార్చి 3న కోర్టుకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది.

మహేష్‌ హీరోగా తెరకెక్కిన ‘శ్రీమంతుడు’ సినిమా బాక్స్‌ఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.’ఊరిని దత్తత తీసుకోవడం’ ఈ సినిమా సారాంశం. ఊరిని ఉద్ధరించే కథాంశాలు తెలుగు తెరపై చాలా వచ్చిన..వాటికి కంటే కొంచెం డిఫెరంట్‌గా ఈసినిమా తెరకెక్కించాడు దర్శకుడు కొరటాల శివ. అయితే, 2012లో తాను రాసిన చచ్చేంత ప్రేమ నవలనే కాపీ కొట్టి సినిమా తీశారరని …  కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించారని  శరత్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో ఈ ముగ్గురిపై ఐపీసీ 120 బీ, కాపీరైట్ యాక్ట్ లోని సెక్షన్‌ 63 కింద కేసు నమోదైంది.

అప్పుడు చిత్ర యూనిట్ సభ్యులకు నోటీసులు కూడా ఇచ్చింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్ధానం మహేష్‌తో పాటు నిర్మాత నవీన్, దర్శకుడు కొరటాల శివకు నోటీసులు జారీ చేసింది. మరి దీనిపై మహేష్‌ అండ్ కో ఎలా స్పందిస్తుందో చూడాలి.

- Advertisement -