మజ్ను సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన కథానాయిక అను ఇమ్మాన్యుయేల్. ఆ తర్వాత కిట్టు ఉన్నాడు జాగ్రత్త వంటి చిత్రం ఆమెకు మంచి క్రేజ్ తీసువచ్చింది. అయితే పవర్ స్టార్ తో జోడి కట్టి నటించిన ‘అజ్ఞాతవాసి‘ చిత్రంపై భారీ ఆశలు పెట్టుకుంది. ఈ చిత్రంతో అవకాశాలు పెరుగుతాయని భావించిన అనుకి, ఆ సినిమా డిజాస్టర్ కావడంతో ఆమెకు నిరాశే మిగిలింది . అయితే మరో స్టార్ హీరో అల్లు అర్జున్ తో నటించిన నా పేర్య సూర్యతో తన దశ తిరిగుతుందని భావించిన అమ్మడుకు నిరాళే ఎదురైంది.
స్టార్ హీరోలతో కలిసి నటించిన రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో ఈ అమ్మడు నిరాశ చెందిందని అంటున్నారు. తాజాగా నా పేరు సూర్య థ్యాంక్స్ మీట్ కి కూడా వెళ్లలేదు. వ్యక్తిగత కారణాల వల్ల ఈ కార్యక్రమానికి రాలేకపోతున్నట్లు చెప్పినప్పటికీ… అసలు విషయం మాత్రం ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోకపోవడంతో అప్సెట్ అయిందని ఫిలింనగర్ లో టాక్ వినిపిస్తోంది. మరోవైపు ఈ అమ్మడు ‘శైలజా రెడ్డి అల్లుడు‘ సినిమాపైనే హోప్స్ పెట్టుకుందట. మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరోగా నాగచైతన్య చేస్తున్నారు. మరీ ఈ సినిమా అయిన అనుకి కలిసి వస్తుందో లేదో చూడాలి మరీ.