ఆయన సాలీడ్‌గా ఉన్నాడు..

235
Samantha comment on nagrjuna
- Advertisement -

సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో నాగార్జున హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ఆఫీసర్’. వీరిద్దరి కలయికతో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. గతంలో వర్మ-నాగ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘శివ’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకుంది.

Samantha comment on nagrjuna

చాలా ఏళ్ల తర్వాత మళ్లీ వీరిద్దరి కలయికలో వస్తున్న ఆఫీసర్ సినిమాపై అంచనాలు తారా స్థాయికి చేరాయి. ఇక ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్‌ను చిత్ర బృందం నేడు విడుదల చేసింది. వర్మ స్టైల్లో ఉన్న ఈ ట్రైలర్‌ నాగార్జునను కొత్తగా యంగ్‌గా చూపించాడు. ట్రైలర్‌లో యాక్షన్ సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయి. ఇందులో నాగ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తున్నాడు.

గతంలో చిత్ర యూనిట్ ఈ సినిమా టీజర్లను ఒక్కొక్కటిగా విడుదల చేసి సినిమాపై అంచలనాలను పెంచారు. ఈ ట్రైలర్‌ను చూసిన సమంత ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. ‘థియేట్రికల్ ట్రైలర్, పోస్టర్‌లో నాగ్ చాలా సాలీడ్‌గా ఉన్నారు. మే 25వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నా’ అని ట్వీట్ చేసింది. కంపెనీ ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సుధీర్ చంద్ర నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అజయ్, షాయాజీ షిండే ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రం ఈ నెల 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

- Advertisement -