కర్నాటక ఎన్నికలు..ఓటేయని ఊరు..!

207
karnataka elections
- Advertisement -

దేశ వ్యాప్తంగా కర్నాటక ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. కన్నడ ఓటరు ఏం తీర్పు చెప్పబోతున్నాడు!.. కమలం కర్ణాటకలోనూ వికసిస్తుందా?.. లేక హస్తానికే మళ్లీ పట్టం కట్టి ఇప్పటిదాకా కొనసాగుతూ వస్తున్న ఆనవాయితీని బ్రేక్ చేస్తారా? అనే సందేహం నెలకొంది. తాజా సమాచారాం ఇప్పటివరకు 60 శాతం పోలింగ్ నమోదు కాగా ఓ గ్రామం మాత్రం ఎన్నికలకు బహిష్కరించి పోలింగ్‌కు దూరంగా ఉంది.

ఎన్నికసార్లు మొరపెట్టుకున్నా తమ ఊరుకు గ్రామ పంచాయతీ భవనం నిర్మించడం లేదని కల్బురగి జిల్లా చిత్తాపూర్ తాలుకా తార్కస్‌పేట్ గ్రామవాసులు ఓటింగ్‌ని బహిష్కరించారు. గ్రామపంచాయతీ భవనం కట్టించే వరకూ ఓటేయబోమని చెబుతున్నారు. గ్రామంలో మొత్తం 3500 మంది జనాభా ఉండగా.. మెజార్టీ ఓటర్లు పోలింగ్‌కు దూరంగా ఉన్నారు.
శనివారం (మే 12) జరుగుతున్న శాసనసభ ఎన్నికల పోలింగ్‌కు దూరంగా ఉన్నారు.

పోలింగ్ నేపథ్యంలో అధికారులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. 55,600 పోలింగ్‌ బూత్‌లను ఏర్పాటు చేశారు.మూడున్నర లక్షల మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు. ప్రధాన పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్యే ఉండటంతో కన్నడ ఓటరు ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నాడన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. 1985నుంచి ఇప్పటిదాకా కన్నడ ఓటరు ఏ పార్టీకి వరుసగా రెండుసార్లు అధికారం కట్టబెట్టలేదు. అయితే కాంగ్రెస్ మాత్రం ఆ సాంప్రదాయాన్ని బద్దలు కొడుతామన్న ధీమాతో ఉండగా కమలం మాత్రం తాము దక్షిణాదిలో అధికారంలోకి రాబోతున్నామని చెబుతోంది. మరి ఈ హోరాహోరీ పోరులో ఎవరు గెలుస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

- Advertisement -