వరుణ్ తేజ్, అదితి రావు హైదరి, లావణ్య త్రిపాఠి కలిసి నటిస్తున్న ‘అంతరిక్షం 9000 KMPH’ చిత్రం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది.ఈ విషయాన్నీ సినిమా హీరో వరుణ్ తేజ్ ట్విట్టర్లో తెలియజేశారు.. షూటింగ్ స్పాట్‌లోని ఓ ఫోటోని యాడ్ చేస్తూ ఈ చిత్రానికి పనిచేయడం ఎంతో అమేజింగ్‌గా అనిపించింది అని వెల్లడించారు.మొదటి సినిమా ‘ఘాజి’తో నేషనల్ అవార్డు గెలుచుకున్న సంకల్ప్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. హై టెక్నికల్ వాల్యూస్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా యాక్షన్ ఎపిసోడ్స్‌ని హాలీవుడ్ నిపుణులు డిజైన్ చేయగా విజువల్ ఎఫెక్ట్స్‌ని కూడా హై లెవెల్లో ప్లాన్ చేశారు.
త్వరలోనే ఈ సినిమా టీజర్ రిలీజ్ డేట్‌ని అధికారికంగా ప్రకటించనున్నారు చిత్ర నిర్మాతలు.ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ రాగా , ఇప్పటి వరకు తెలుగులో రాని ఒక విభిన్నమైన కాన్సెప్టుతో వస్తున్న సినిమా కావడంతో అందరిలో మంచి అంచనాలు పెరిగాయి.జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీని అందిస్తున్న ఈ సినిమాని దర్శకుడు జాగర్లమూడి క్రిష్,సాయి బాబు జాగర్లమూడి,రాజీవ్ రెడ్డిలు ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.డిసెంబర్ 21న సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవబోతుండగా తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా సరికొత్త అనుభూతిని మిగిల్చబోతుంది.తెలుగులో పూర్తిస్థాయి ‘అంతరిక్షం’ నేపథ్యంలో రూపొందిన తొలి సినిమా ఇదే.
నటీనటులు: వరుణ్ తేజ్, అదితి రావు హైదరి, లావణ్య త్రిపాఠి, సత్యదేవ్, శ్రీనివాస్ అవసరాల తదితరులు.. సాంకేతిక నిపుణులు :సమర్పించు వారు : క్రిష్ జాగర్లమూడి,నిర్మాతలు : క్రిష్ జాగర్లమూడి, సాయి బాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి,బ్యానర్: ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్,డీఓపీ : జ్ఞాన శేఖర్ VS,ఎడిటర్: కార్తీక్ శ్రీనివాస్,సంగీతం: ప్రశాంతి విహారీ,ప్రొడక్షన్ డిజైనర్స్: సబ్బాని రామకృష్ణ & మోనికా,యాక్షన్ కొరియోగ్రాఫర్: టాడార్ పెట్రోవ్ లాజరోవ్,దర్శకుడు: సంకల్ప్ రెడ్డి.