చైతన్యరథయాత్రకు సిద్ధమౌతున్న’ఎన్టీఆర్’..

242
- Advertisement -

బాలకృష్ణ, క్రిష్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా ‘ఎన్టీఆర్’. ఈ మూవీ షూటింగ్ చకచక జరుగుతుంది. ఇప్పటికే పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించిన దర్శకుడు క్రిష్ త్వరలో రథయాత్రకు సంబంధించిన సీన్స్ను చిత్రీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎన్టీఆర్ రాజకీయ ప్రయాణంలో చైతన్య రథ యాత్ర చాలా ప్రధానమైనది అనే విషయం తెల్సిందే. అందుకే ‘ఎన్టీఆర్’ బయోపిక్‌లో ఆ సీన్స్ కోసం దర్శకుడు క్రిష్‌ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట.

NTR Biopic

‘చైతన్యరథయాత్ర’కి సంబంధించిన షూటింగు శ్రీకాకుళం,విజయనగరం,విశాఖ,అన్నవరం,గుంటూరు జిల్లాల్లో ఈ రథయాత్రను చిత్రీకరించనున్నారు. ఈ షెడ్యూల్లో హరికృష్ణ పాత్రను కల్యాణ్ రామ్ పోషించనున్నాడు. ఈ షెడ్యూల్ చిత్రీకరణతో ఈ సినిమా 50 శాతం చిత్రీకరణను పూర్తిచేసుకున్నట్టు అవుతుంది. నందమూరి అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఈ సినిమాను, సంక్రాంతి కానుకగా జనవరి 9వ తేదీన విడుదల చేయనున్నారు.

- Advertisement -