పీవీ మార్గ్‌లో మరో పార్క్ ఆవిష్కరణ

24
- Advertisement -

ట్యాంక్ బండ్ సరసన మరొక ఆహ్లాద పర్యాటక కేంద్రం ఆవిష్కృతమైంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) ఆధ్వర్యంలో రూ.26.65 కోట్ల వ్యయంతో అద్భుతంగా రూపుదిద్దుకున్న లేక్ ఫ్రంట్ పార్క్ ను మంగళవారం రాత్రి పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు కార్యదక్షతతో రాష్ట్రంతో పాటు హైదరాబాద్ నగరం అద్భుతంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఎంఎయూడి స్పెషల్ చీఫ్ సెక్రటరీ, హెచ్ఎండిఏ మెట్రోపాలిటన్ కమిషనర్ అర్వింద్ కుమార్ మాట్లాడుతూ ముంబయి ఆర్కిటెక్ట్ కిషోర్ ప్రదాన్ తో లేక్ ఫ్రంట్ పార్క్ ను డిజైన్ చేయించినట్లు తెలిపారు. రాత్రి పదకొండు గంటల వరకు లేక్ ఫ్రంట్ పార్క్ సందర్శకులకు అందుబాటలో ఉంటుందని తెలిపారు.

కార్యక్రమంలో హెచ్ఎండిఏ అర్బన్ ఫారెస్ట్ డైరెక్టర్ డాక్టర్ బి.ప్రభాకర్, బుద్ద పూర్ణిమ ప్రాజెక్ట్ ఓఎస్డీ చంద్రారెడ్డి, సూపరింటెండెంట్ ఇంజనీర్ పరంజ్యోతి, అసిస్టెంట్ డైరెక్టర్ విశ్వప్రసాద్ లతో పాటు హెచ్ఎండిఏ అధికారులు, అర్బన్ ఫారెస్ట్ అధికారులు పాల్గొన్నారు.

Also Read:‘జవాన్’..సింగిల్ షాట్ గ్లింప్స్

- Advertisement -