పూజాకి మరో క్రేజీ ఛాన్స్

79
- Advertisement -

వరుస ఫ్లాప్‌లతో సతమతమవుతున్న హీరోయిన్ పూజా హెగ్డే మరో క్రేజీ ప్రాజెక్టు ఓకే చేసింది. బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ సరసన నటించే ఛాన్స్‌ కొట్టేసింది. రోషన్ ఆండ్రూస్ దర్శకత్వంలో వస్తున్న చిత్రానికి ‘కోయీ షాక్’ అనే టైటిల్ పెట్టారు. మర్డర్ మిస్టరీ నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమా వస్తోంది. షూటింగ్ ఈ నెలలోనే ప్రారంభం కావాల్సింది. కానీ, కొన్ని కారణాల వల్ల పోస్ట్ ఫోన్ చేశారు. వచ్చే నెల మొదటి వారం నుంచి షూటింగ్ ను ప్లాన్ చేస్తున్నారు. పూజా హెగ్డే కూడా ఈ మొదటి షెడ్యూల్ లో జాయిన్ కానుంది. అన్నట్టు.. ఈ సినిమాలో ఓ సాంగ్ కోసం పూజా హెగ్డే బికినీ కూడా వేయబోతుంది.

ఇలా అందాలు అడ్డు అదుపు లేకుండా ప్రదర్శిస్తోంది కాబట్టే.. ఆమెకు క్రేజీ ఛాన్స్ లు వస్తున్నాయని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. టాలీవుడ్‌తో పాటూ బాలీవుడ్ లో కూడా స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న పూజా హెగ్డేకు ప్ర‌స్తుతం చెప్పుకోద‌గ్గ హిట్లు లేవు. అయినా, అందాల ఆర‌బోత విష‌యంలో మాత్రం పూజా హెగ్డే త‌న త‌ర్వాతే ఎవ‌రైనా అన్న‌ట్లుగా అందాలు చూపిస్తోంది. అమ్మడు అందాలకు కుర్రకారు కూడా ఫిదా కావడంతో ఆమెకు ఫుల్ డిమాండ్ ఉంది. ఈ క్రమంలోనే పూజా హెగ్డేకి స్టార్ హీరోలు కూడా ఛాన్స్ లు ఇస్తున్నారు.

Also Read:డూప్లెక్స్ ఇల్లు కొన్న స‌మంత

పూజా హెగ్డే మరో రెండు ప్రాజెక్టులకు సైన్ చేసిందని టాక్. ఇప్పటికే, మహేష్ బాబు – త్రివిక్రమ్ కలయికలో వస్తోన్న సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాతో పాటు ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ సినిమాలో కూడా పూజా హెగ్డే పేరే వినిపిస్తుంది. మొత్తానికి పూజా హెగ్డేకి లక్ ఫుల్ గా ఉన్నట్టు ఉంది. సక్సెస్ లేకపోయినా ఛాన్స్ లు వస్తూనే ఉన్నాయి.

Also Read:వేసవిలో ఇలా చేస్తేనే ఆరోగ్యం!

- Advertisement -