రేవంత్ రెడ్డికి ఎన్నారై టీఆర్ఎస్ సవాల్..

97
anil kurmachalam

ఇటీవల మంత్రి కేటీఆర్ గారి పై రేవంత్ రెడ్డి చేసిన వాఖ్యాలను విమర్శలను ఎన్నారై తెరాస తీవ్రంగా ఖండిస్తుందని ఎన్నారై టి.ఆర్.యస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం తెలిపారు.రేవంత్ రెడ్డి…. నేను జెడ్పిటీసి, ఎమ్మెల్యే, ఎంపీ అయినా అని చెప్పుకోవడం కాదు, ప్రజలకు ఏం చేసినవో చెప్పాలి, ఎంత సేపు పదవులని నీ ఎదుగుదలకు ఉపోయోగించుకున్నావు కానీ ప్రజల అభివృద్ధికి కృషి చెయ్యలేదు. అందుకే ఎమ్మెల్యేగా ప్రజలు ఓడించి ఇంటికి పంపిన విషయం గుర్తుకు పెట్టుకోవాలని అనిల్ కూర్మాచలం తెలిపారు. మంత్రి కేటీఆర్ ని విమర్శించే నైతిక హక్కు రేవంత్ రెడ్డికి లేదని, నేడు విసురుకోవలసింది వైట్ ఛాలెంజ్ లు బ్లాక్ ఛాలెంజ్ లు కాదని, దమ్ముంటే ” డెవలప్మెంట్ ఛాలెంజ్” స్వీకరించి ప్రజా ప్రతినిధిగా ఇన్ని సంవత్సరాలు ఏం చేసావు ప్రజలకు చెప్పాలని అనిల్ సవాల్ చేశారు.రేవంత్ రెడ్డి నాలుగు సభలకే మతి స్థిమితం కోల్పోయి ఆయనేదో దేశానికి అధిపతి అయినట్టు బిల్డప్ ఇస్తున్నాడని, ఆలా అనుకుంటే గత ఇరవై సంవత్సరాలుగా దేశంలోనే బహిరంగ సభలతో చరిత్ర సృష్టించిన ఘనత టి.ఆర్.యస్ పార్టీది, కెసిఆర్ ది. ఒక బాధ్యతగల స్థానంలో ఉండి ప్రభుత్వానికి నిర్మాణాత్మక సలహాలు ఇవ్వాల్సింది పోయి ఎంత సేపు వ్యక్తిగత దూషణలతో ఇప్పటికే ప్రజల్లో చులకనయ్యాడని , ఎన్నారైలు సైతం అసహ్యించుకుంటున్నారని అనిల్ తెలిపారు.


ఇప్పటికైనా రేవంత్ రెడ్డి పద్ధతి మార్చుకొని తన సొంత అభివృద్ధి కోసం పని చేసుకోకుండా ప్రజల అభివృధ్ధికోసం పని చెయ్యాలని, ఇలాగే మంత్రుల మీద, టి.ఆర్.యస్ నాయకుల మీద పిచ్చి పిచ్చి విమర్శలు చేస్తే తప్పకుండా బుద్ది చెప్తామని అనిల్ కూర్మాచలం హెచ్చరించారు.సత్య నాదెళ్ల ఎవరో కూడా తెలియని జ్ఞానం లేని చరిత్ర నీది, కానీ అదే సత్య నాదెళ్లతో ప్రశంసలందుకున్న చరిత్ర మంత్రి కేటీఆర్ గారిది ఇంతకంటే రుజువు ఏం కావాలి ఎవరి స్థాయి ఏందో ప్రజలకు తెలవడానికి, కాబట్టి మాటలు తక్కువ చేసి ప్రజలకు ఉపయోగపడే పని చెయ్యాలని అనిల్ కూర్మాచలం హితవు పలికారు.

ప్రపంచం లో నిన్ను నాయకుడిగా ఆదర్శంగా తీసుకొనే ఒక్క మనిషి కూడా లేడని ఎందుకంటే నీ చరిత్ర మొత్తం అవినీతి, బ్లాక్మెయిల్, పట్ట పగలు దొరికిన ఓటుకు నోటు దొంగవని ప్రపంచానికి తెలుసునని, నీ సామర్థ్యం గొప్పతనం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత తనకే మంచిదని హితవు పలికారు. అన్ని చరిత్రలు చెప్పి తన ఓటు కు నోటు దొంగ చరిత్ర మాత్రం చెప్పడం మర్చిపోయిన దొంగ రేవంత్ రెడ్డి అని, మరి దొంగతనం దాచిపెడితే దాగేది కాదని ప్రజలంతా చూస్తున్నారని సరైన సందర్భంలో తగిన బుద్ది చెప్తారని అనిల్ కూర్మాచలం తెలిపారు. మంత్రి కేటీఆర్ గారు ఆదర్శవంతమైన నాయకుడని దేశం మొత్తం వారి పనితనాన్ని నాయకత్వాన్ని ప్రశంసిస్తుందని, వారి వెంట క్షేత్రస్థాయి నుండి ప్రపంచస్థాయి కార్యకర్తలు అభిమానులు ఉన్నారని, భవిష్యత్తులో ఇలాగే విమర్శిస్తే తగిన బుద్ది చెప్తారని రేవంత్ రెడ్డిని హెచ్చరించారు.