ఏపీలో ఎన్నికల వే ” ఢీ ” ?

393
- Advertisement -

ఏపీలో ప్రస్తుతం వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలు చూస్తుంటే.. ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయా ? అనే సందేహాలు రాక మానవు. ఎందుకంటే ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయం ఉన్నప్పటికి ఇప్పుడే ఎన్నికలు అనెంతలా హైరానా చేస్తున్నాయి మూడు ప్రధాన పార్టీలు. ఇప్పటికే 175 స్థానాల్లో విజయమే టార్గెట్ గా పెట్టుకున్న ఏపీ సి‌ఎం జగన్మోహన్ రెడ్డి. ఈ మద్య తీసుకుంటున్న నిర్ణయాలు ముందస్తు ఎన్నికలకు సూచనగానే కనిపిస్తున్నాయి. ముందుగా వైసీపీ పార్టీలోని నియోజక వర్గ ఇన్ చార్జ్ లు, జిల్లా అధ్యక్షుల పదవులలో కీలక మార్పులు చేసి పార్టీలో సంస్థాగత మార్పులకు శ్రీకారం చుట్టారు. .

అంతే కాకుండా కీలకమైన అధికారుల విషయంలో కూడా చాలానే మార్పులు చేశారు. అలాగే నిత్యం ప్రజల్లో ఉండాలని అలసత్వం పనికి రాదని తరచూ వైసీపీ నేతలకు సూచిస్తున్నారు సి‌ఎం జగన్. ఇవన్నీ చూస్తుంటే జగన్ ముందస్తూ ఎన్నికల వైపు చూస్తున్నారా ? అనే ప్రశ్నలు వ్యక్తమౌతున్నాయి. ఇక ఎన్నికలు ఎప్పుడొచ్చిన తాము సిద్దమేనని అటు టీడీపీ అధినేత చంద్రబాబు, ఇటు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కూడా వారి వారి ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు.

ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు వరుస పర్యటనలు చేస్తూ ఎన్నికల వేడిని రాజేస్తున్నారు. అటు పవన్ కూడా తనదైన రీతిలో ప్రజల్లో ఉండేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇక పవన్ తాజాగా తన ప్రచార రథాన్ని కూడా సిద్దం చేసుకున్నారు. త్వరలోనే ఏపీ అంతటా పర్యటించేందుకు పవన్ సిద్దమౌతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ రోజుగా నడుస్తోంది. ఈ పరినమలన్నీ చూస్తుంటే ఏపీలో ఎన్నికల వేడి ఇప్పటి నుంచే మొదలైనట్లు కనిపిస్తోంది. మరి ఈసారి ఎన్నికల్లో విజయం పై ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్న మూడు పార్టీలలో ప్రజలు ఏ పార్టీకి విజయం కట్టబెడతారో చూడాలి.

ఇవి కూడా చదవండి…

పవన్ కళ్యాణ్ కు వారాహి చిక్కులు…

చరిత్రలో మైలు రాయి…డిసెంబర్ 9

ఏపీ టాప్…ప్రజాప్రతినిధులపై సీబీఐ కేసులు

- Advertisement -