టోల్ గేట్ వద్ద హంగామా సృష్టించిన మంత్రి భార్య

196
prathipati Venkatkumari

ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు భార్య వెంకటకుమారి టోల్ గేట్ వద్ద హంగామా సృష్టించారు. మంత్రి భార్యను నన్నే టోల్ ఫిజ్ అడుగుతారా అంటూ టోల్ గేట్ సిబ్బందితో వాగ్వాదానికి దిగింది. తన కారుకు ఎమ్మెల్యే స్టిక్కర్ ఉందని తాను టోల్ ఫిజు చెల్లించనని తేల్చి చెప్పింది. అయినా సరే ఫిజు కట్టే వరకూ ఆమెను అక్కడి నుంచి పంపించలేదు సిబ్బంది. చివరకు టోల్ ఫిజు కట్టి ఆమె అక్కడి నుంచి వెళ్లి పోయారు. మంత్రి భార్య వెంకటకుమారి కారులో హైదరాబాద్ నుంచి విజయావాడకు వెళ్తుంది.

మార్గం మధ్యలో నల్గొండలోని మాడుగుల పల్లి టోల్ ప్లాజా వద్ద కు రాగాను ఆమె కారును ఆపేశారు సిబ్బంది. టోల్ ఫీజుగా రూ.40 కట్టాలని సూచించారు. అయితే తాను మంత్రి భార్యననీ, తన కారుకు స్టిక్కర్ ఉందని వెంకటకుమారి చెప్పారు. తాను ఫీజును కట్టనని స్పష్టం చేశారు. అయితే కేవలం ఎమ్మెల్యే కారుకు మాత్రమే టోల్ మినహాయింపు ఉంటుందనీ, కుటుంబ సభ్యులకు ఉండదని టోల్ సిబ్బంది తేల్చిచెప్పారు. చివరికి మరో మార్గం లేకపోవడంతో టోల్ ఫీజు కట్టేసి వెంకటకుమారి అక్కడి నుంచి వెళ్లిపోయారు. టోల్ గేట్ సీసీ కెమెరాలో రికార్డయిన ఈవీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.