సంక్రాంతి ఫీవర్ ..టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ జామ్

478
tollplaza
- Advertisement -

తెలుగు రాష్ట్రాల ప్రజలకు అతి ముఖ్యమైన పండగల్లో సంక్రాంతి కూడా ఒకటి. సంక్రాంతి పండుగ సందర్భంగా నేటి నుంచి పాఠశాలలు, ఆఫీసులకు సెలవులు ప్రకటించారు. దీంతో పట్నం నుంచి కుటుంబ సమేతంగా పల్లెలకు పయనమవుతున్నారు ప్రజలు. ఈసందర్భంగా రోడ్లన్ని వాహనాలతో నిండిపోయాయి. హైదరాబాద్ లోని జేబిస్, ఎంజీబీస్ తో పాటు పలు బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు ప్రయాణికులతో కిటికిటలాడుతున్నాయి.

tollplaza

టోల్‌ప్లాజాల వద్ద అక్కడక్కడా ట్రాఫిక్ జామ్ అవుతోంది. మాడ్గుపల్లి, కొర్లపహాడ్ టోల్ ప్లాజాల వద్ద వాహనాల రద్దీగా బాగా ఉంది. హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై భారీ సంఖ్యలో వాహనాలు బారులు తీరాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఛార్జీలు పెంచేశారు. సాధారణరోజుల్లో కంటే 30శాతం అధికంగా డబ్బులు వసూళ్లు చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ కు రోజు 600 ప్రత్యేక బస్సులను నడుపుతున్నారు. బస్టాండ్లతో పాటు రైల్వే స్టేషన్లలో కూడా రద్దీ నెలకొంది. సంక్రాంతి పండగకు దక్షిణమధ్య రైల్వే దాదాపు 400 రైళ్లను నడిపిస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -