ఏపీలో కొత్త 1,395 కరోనా కేసులు..

30
corona

ఏపీలో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో 1,395 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 9 మంది చనిపోయారు. ఇప్పటి వరకు మొత్తం 6,890 మంది మృతి చెందారు. కాగా 2,293 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలోని మొత్తం కేసులు 8,56,159కి పెరిగాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 16,985 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజాగా నమోదైన పాజిటీవ్‌ కేసుల్లో అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 214 కేసులు, కర్నూలు జిల్లాలో అత్యల్పంగా 18 కేసులు నమోదయ్యాయి.