వాసాలమర్రి ప్రజలు సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటారు..

22
MLA Gongidi Sunitha

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామంలో హైదరాబాద్ యశోదా ఆసుపత్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే శ్రీమతి గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని గ్రామస్తులకు సూచించారు. వాసాలమర్రి గ్రామ ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి రుణపడి ఉంటారని, ముఖ్యమంత్రి గ్రామాన్ని దత్తత తీసుకున్నందున కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.