వీరి ముందు విషాదం సైతం చిన్న‌బోయింది..

225
Anchor had to read out breaking news of husband’s death
- Advertisement -

తన జీవిత భాగస్వామి మృతి చెందారని తెలిసినప్పటికీ.. ఆ బాధను సైతం దిగమింగుకొని తన ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించింది. ఆమె ధైర్యం ముందు విషాదం సైతం చిన్న‌బోయింది. ఈ ఘటనే ఛత్తీస్ గఢ్ లో చోటుచేసుకుంది. ఈ వివరాల్లోకి వెళ్తే… సుప్రీత్‌ కౌర్‌ (28) గత తొమ్మిదేళ్లుగా ఛత్తీస్‌ గఢ్‌ లోని ఓ ప్రముఖ వార్తా ఛానెల్‌ లో న్యూస్‌ రీడ‌ర్‌ గా పనిచేస్తున్నారు. ఈ ఉదయం విధులకు హాజరైన ఆమె రిపోర్టర్ ఇచ్చిన సమాచారం ప్రకారం పితార ప్రాంతంలో ఓ రెనాల్ట్‌ డస్టర్‌ కారు ప్రమాదానికి గురైందని, అందులో ఐదుగురు ప్రయాణిస్తుండగా ముగ్గురు మృత్యువాతపడ్డారని హెడ్ లైన్స్ లో చదివారు. ఆ కారు తన భర్తదేనని, ఆ కారును నడుపుతున్న వ్యక్తి కూడా తన భర్తేనని, ఆయన మరణించారని ఆమెకు అప్పుడే అర్థమైంది. అప్పటికే డెస్క్ లో ఈ వార్త తెలుసుకున్న సిబ్బంది విషణ్ణవదనులైపోయారు. దీనిపై వారు స్పందిస్తూ… ఆమె జీవితంలో జరిగిన ఈ దుర్ఘటన తమల్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని పేర్కొన్నారు. ఆమె ధైర్యానికి ఆశ్చర్యపోయిన వారంతా దేవుడు ఆమెకు మనోనిబ్బరాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఆమెకు హర్సద్‌ కవాడే అనే వ్యక్తితో గతేడాది వివాహమైంది. వీరిద్దరూ రాయ్‌ పూర్‌ లోనే నివాసం ఉంటున్నారు.

ఇలాంటి మరో ఘటన ఐపీఎల్‌-10లో చోటు చేసుకుంది.19 ఏళ్లున్న ఆ కుర్రాడు ఎంతో పరిణతిని ప్రదర్శించాడు. తన ఐపీఎల్‌ జట్టు దిల్లీ కోసం దుఃఖాన్ని దిగమింగుకుంటూ బరిలోకి దిగి.. అద్భుత బ్యాటింగ్‌తో తన జట్టును తొలి మ్యాచ్‌లో గెలిపించేందుకు విశ్వప్రయత్నం చేశాడు. ఆ కుర్రాడు రిషబ్‌ పంత్‌. పంత్‌ తండ్రి బుధవారం రాత్రి మృతి చెందారు.

rishab father

అంత్యక్రియలకు హాజరై.. మరుసటి రోజే పంత్‌ దిల్లీ జట్టును కలిశాడు. తండ్రి అంత్యక్రియలకు వెళ్లిన రిషభ్ గురువారం దహన సంస్కారాలు చేసి వస్తుండగా జరిగిన ప్రమాదంలో స్వల్పంగా గాయపడ్డాడు. అయితే శనివారం జరిగిన మ్యాచ్‌లో దుఃఖాన్ని దిగమింగి బ్యాటింగ్‌కు దిగిన పంత్ అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. రిషభ్ కడదాకా చేసిన పోరాటం జట్టుకు విజయాన్ని అందివ్వకపోయినా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు.158 పరుగుల ఛేదనలో రిషబ్‌ పంత్‌ (57; 36 బంతుల్లో 3×4, 4×6) అద్భుతంగా పోరాడినా దిల్లీకి ఓటమి తప్పలేదు.

- Advertisement -