కృష్ణవంశీ రంగమార్తాండలో రంగమ్మత్త

603
anchor anasuya
- Advertisement -

బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అనసూయ. అప్పుడప్పుడు వెండితెరపై కూడా నటిస్తూ..ప్రేక్షకులను అలరిస్తోంది. అయితే అనసూయ నటించిన సినిమాలు ఏవి అంత పెద్దగా విజయం సాధించలేదు. కానీ రామ్ చరణ్ రంగస్ధలం సినిమాలో అనసూయ పాత్రకు మంచి పేరు వచ్చింది. ఇటివలే విజయ్ దేవరకొండ నిర్మించిన మీకు మాత్రమే చెప్తా మూవీ కూడా కీలక పాత్రలో నటించింది. తాజాగా అనసూయ మరో సినిమాకు సైన్ చేసింది.

ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రంగమార్తాండ సినిమాలో నటించనుంది అనసూయ. ఇప్పటికే ఈమూవీ షూటింగ్ ప్రారంభమైంది. ప్రకాశ్ రాజ్ ప్రధానపాత్రలో నటిస్తున్న ఈసినిమాలో రమ్యకృష్ణ ముఖ్య పాత్రలో కనిపించనుంది. స్టార్ కమెడియన్ బ్రహ్మనందం కూడా ఈసినిమాలో నటిస్తున్నారు. తాజాగా ఈసినిమా నుంచి బ్రహ్మనందం ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు చిత్రయూనిట్. దర్శకుడు క్రిష్ణవంశీ చాలా రోజుల తర్వాత చేస్తున్న సినిమా కావడంతో ఈమూవీపై భారీగా ఆశలు పెట్టుకున్నాడు. వచ్చే ఏడాది సమ్మర్ లో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు చిత్రయూనిట్.

Anchor Anasuya In Director Krishna Vamshi Rangamartanada Movie

- Advertisement -