సమంత శర్వానంద్ “జాను” విడుదల తేదీ ఖరారు

559
Sharwaannad Samantha.jpeg
- Advertisement -

తమిళ్ లో భారీ విజయం సాధించిన 96 మూవీని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన ఈ సినిమా కోలీవుడ్‌లో భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. తెలుగులో సమంత, శర్వానంద్ లు జంటగా నటిస్తున్నారు. తమిళ్ లో 96మూవీ తెరకెక్కించిన దర్శకుడు ప్రేమ్ కుమార్ తెలుగులో కూడా ఆయన దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు.

కాగా ఇటివలే ఈమూవీ షూటింగ్ పూర్తిచేసుకుంది. ఈవిషయాన్ని సమంత తన ట్వీట్టర్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. తాజాగా ఈసినిమా విడుదల తేదీని ఖారారు చేశారు చిత్రయూనిట్. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న ఈమూవీ థియేటర్లలోకి రానున్నట్లు నిర్మాత దిల్ రాజు నిర్ణయించారని సమాచారం.

Sharwannad samantha Janu Movie Release Date Locked

- Advertisement -