ఎమ్మెల్యేగా యాంక‌ర్ అన‌సూయ‌

308
Anasuya
- Advertisement -
యాంక‌ర్ అన‌సూయ బుల్లితెర‌పై కాకుండా ఈమ‌ధ్య వెండితెర‌పై కూడా త‌న అందం, న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తోంది. తాజాగా ఆమె సినిమాల్లో న‌టిస్తూ కుర్ర‌కారును నిద్ర‌పొనివ‌కుండా చేస్తుంది. అంతే కాకుండా ఆమె మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఇటివ‌లే రంగ‌స్ధ‌లం సినిమాలో న‌టించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈమూవీతో ఆమెకు మ‌రిన్నీ సినిమాల్లో ఆఫ‌ర్లు వస్తున్నాయి. ఇటివ‌లే విడుద‌లైన ఎఫ్ 2 సినిమాలో కూడా ఓ స్పెషల్ సాంగ్ క‌నిపించి సంద‌డి చేసింది.
anasuya Bharajdwaj
ప్ర‌స్తుతం ఆమె వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి పాద‌యాత్ర ఆధారంగా తెర‌కెక్కుత‌న్న యాత్ర మూవీలో న‌టిస్తున్నారు. ఈమూవీలో ఆమె ఎవ‌రి పాత్ర‌లో క‌నిపించ‌నుంద‌ని అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా అన‌సూయ పాత్ర గురించి లైకైన‌ట్టు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. ఆమె ఎమ్మెల్యే పాత్ర‌లో క‌నిపించ‌నున్నార‌ని తెలుస్తుంది.
anasuya In Yatr aMovie
ఎమ్మెల్యే గౌరు చ‌రితా రెడ్డి పాత్ర‌లో అన‌సూయ న‌టించ‌నున్న‌ట్లు స‌మాచారం.  2004లో కాంగ్రెస్ పార్టీ తరఫున నందికొట్కూరు నియోజక వర్గం నుంచి పోటీ చేసి చరితా రెడ్డి ఏ విధంగా గెలిచారు? .. అప్పటి పరిస్థితులను ఆమె ఎలా ఎదుర్కొన్నారు? కాంగ్రెస్ పార్టీ కోసం ఆమె చేసిన కృషి .. మొదలైన విషయాలను ఈ సినిమాలో చూపించనున్నారట. ఈమూవీ ఫిబ్ర‌వ‌రి 8న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.
- Advertisement -