అఖిల్ ‘మిస్ట‌ర్ మ‌జ్ను’ ట్రైల‌ర్..

193
mr. Maznu

అక్కినేని అఖిల్ తాజాగా న‌టిస్తున్న చిత్రం మిస్ట‌ర్ మ‌జ్ను. ఈచిత్రానికి తొలిప్రేమ చిత్ర ద‌ర్శ‌కుడు వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. నిధి అగ‌ర్వాల్ హీరోయిన్గా న‌టించిన ఈచిత్రాన్ని వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. ఇటివ‌లే విడుద‌లైన ఈచిత్ర టీజ‌ర్ , ఫ‌స్ట్ లుక్ కు ప్రేక్ష‌కుల నుంచి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. దింతో ఈమూవీపై భారీగా అంచనాలు ఉన్నాయి. గ‌ణ‌తంత్ర దినోత్స‌వం సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 25న ఈమూవీని విడుద‌ల చేయ‌నున్నారు.

ఈమూవీ ఆడియో ఫంక్ష‌న్ నిన్న హైద‌రాబాద్ లో జ‌రిగింది. ఈవేడుక‌కు అక్కినేని నాగార్జున‌, నాగ చైత‌న్య తో పాటు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా వచ్చారు. నా కోసం ఎవరైనా ఏడిస్తే అది నా తప్పు కాదు కానీ, నా వల్ల ఒక్కళ్ళు ఏడ్చినా అది ఖచ్చితంగా నా తప్పే అవుతుంది’ అంటూ అఖిల్ చెప్పిన డైలాగ్ చాలా నేచురల్‌గా ఉంది. తాజాగా విడుద‌ల చేసిన ఈ ట్రైల‌ర్ ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తోంది. ఈ చిత్ర ట్రైల‌ర్ మీకోసం..

Mr Majnu Theatrical Trailer | Akhil Akkineni | Nidhhi Agerwal | Thaman S | Venky Atluri | SVCC