హీట్‌ పుట్టిస్తోన్న అనసూయ…

272
- Advertisement -

యాంకర్‌ అనసూయ… ఈవిడ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు బుల్లితెరకు గ్లామర్‌ అద్దిన యాంకర్లలో అనసూయ ముందువరుసలో ఉంటారన్న సంగతి తెలిసిందే. అందం, అభినయంతో తనదైన చలాకితనంతో యాంకరింగ్‌ కే సొగబులు అద్దిన అనసూయ నాలుగు పదుల వయసులోనూ చెక్కుచెదరని అందంతో ప్రేక్షకులను అలరిస్తున్నారనే చెప్పాలి. ఆమె అందానికి ముగ్దులవ్వని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. పెళ్లై ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చినా.. అనసూయలో ఏమాత్రం వన్నెతగ్గేలేదు. ఇటు యాంకరింగ్‌ తో పాటు అటు సినిమాల్లో నటిస్తూనే… కమర్షియలో ప్రోగ్రాంతో అనసూయ పుల్‌ బిజీగా ఉందనే చెప్పాలి.

అయితే తాజాగా అనసూయ సోషల్‌ మీడియాలో చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు.. గ్లామర్‌ ఫోటో షూట్లతో కుర్రకారు గుండెలను బాంబుల్లా పేలుస్తున్న అమ్మడు… అంతటితో ఆగకుండా సోషల్‌ మీడియాలో సెన్సేషనల్‌ పోస్టులు చేస్తూ కాకరేపుతోంది.

తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇన్ స్ట్రాగ్రామ్ లో చేసిన పోస్టు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ గా మారింది. నేను దెబ్బతిన్నా.. కానీ నేను గాయపడిన విధంగా ఎవరినీ బాధ పెట్టను అంటూ రాసుకొచ్చింది. ఈ పోస్టులపై సోషల్‌ మీడియాలో పలు రకాలుగా చర్చ సాగుతోంది. అయితే అనసూయ తనను సోషల్‌ మీడియాలో ట్రోల్‌ చేసిన వారిని ఉద్దేశించి పోస్ట్‌ చేసిందని కొందరు కామెంట్‌ చేస్తుండగా.. మరికొందరు ఓ టీవీ చానెల్‌ యాజమాన్యం అవమానించిన కారణంగానే అనసూయ తన బాధను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిందని కామెంట్స్‌ చేస్తున్నారు. మొత్తానికి అనసూయ ఇన్ స్టాలో చేసిన కామెంట్స్‌ ఓ రకంగా హీట్‌ పుట్టిస్తున్నాయనే చెప్పాలి.

ఇవి కూడా చదవండి..

న్యూ ఇయర్..వెకేషన్‌కి మహేష్

దానిమ్మతో ఆరోగ్యం…

సన్‌రైజర్స్ జట్టు ఇదే!

- Advertisement -