ఎట్టకేలకు అమృత్ పాల్ అరెస్ట్..

44
amrithpal singh
- Advertisement -

పంజాబ్ పోలీసుల వేట ముగిసింది. ఎట్టకేలకు ఖలిస్తాన్ మద్దతుదారుడు, మత ప్రభోధకుడు అమృత్ పాల్ సింగ్ అరెస్ట్ అయ్యాడు. పంజాబ్‌లోని మోగా పోలీసుల ఎదుట అమృత్‌పాల్ లొంగిపోయాడు. అర్థరాత్రి సమయంలో మెగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన ఆయన పోలీసుల వద్ద సరెండర్ అయ్యాడు.

గత కొన్ని రోజులుగా పోలీసులకు సవాల్ విసురుతూ చెమటలు పట్టించాడు అమృత్ పాల్. ఆయన కోసం పోలీసులు విస్తృత గాలింపు చర్యలు చేపట్టిన ఫలితం లేకపోయింది. మారువేశాల్లో తప్పించుకుని తిరుగుతూ మోస్ట్ వాంటెడ్‌గా మారాడు. మారువేషంలో ఢిల్లీ వీధుల్లో అమృత్ పాల్ తిరిగినట్లు సీసీ పుటేజీల్లో రికార్డయ్యాయి. అమృత్ పాల్ సింగ్ విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నించారన్న వార్తలు కూడా వచ్చాయి. దీంతో అన్ని విమానాశ్రయాల్లో పటిష్ట భద్రతను ఏర్పాటు చేయడంతో పాటు, సరిహద్దుల్లో బీఎస్ఎఫ్, ఎస్ఎస్‌బీలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. దీంతో ఎక్కడికి వెళ్లలేని పరిస్థితి రావడంతో పోలీసులకు చిక్కాడు అమృత్.

Also Read:విస్తరిస్తున్న బి‌ఆర్‌ఎస్.. కారణం అదే!

- Advertisement -