బచ్చన్‌ బ్యాక్‌ టు ది బిగినింగ్‌ :పీవీఆర్‌ సంస్థ

60
- Advertisement -

బాలివుడ్‌ బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ 80వ పుట్టినరోజును పురస్కరించుకొని ఫిల్మ్‌ హెరిటేజ్‌ ఫౌండేషన్‌ వాళ్లు ఫిల్మ్‌ ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 17నగరాల్లో బిగ్‌బి నటించిన సినిమాలు ప్రదర్శించబడతాయని ఫౌండేషన్‌ ప్రకటించింది. ముంబై, ఢిల్లీ, కోల్‌కత్తా, బెంగళూరు, హైదరాబాద్‌, అహ్మదాబాద్‌, సూరత్‌, బరోడా, రాయ్‌పూర్‌, కాన్పూర్‌, కొల్హాపూర్‌, ఇండోర్‌ నగరాల్లో సినిమాలు ప్రదర్శిస్తామని తెలిపారు. బచ్చన్‌ స్వస్థలమైన ప్రయాగ్‌రాజ్‌లో కూడా ఏర్పాటు చేయనున్నారు. పీవీఆర్‌ సంస్థ, ఫిల్మ్‌హెరిటేజ్‌ ఫౌండేషన్‌ వాళ్లు సంయుక్తంగా బచ్చన్‌ బ్యాక్‌ టు ది బిగినింగ్‌ను నిర్వహిస్తున్నారు.

బచ్చన్‌ బ్యాక్‌ టు ది బిగినింగ్‌ అనే పేరుతో నాలుగు రోజుల పాటు జరిగే ఈ ఈవెంట్‌ అక్టోబర్‌ 8న ప్రారంభించి, బిగ్‌బి పుట్టిన రోజైన అక్టోబర్‌ 11న ఈ ఉత్సవాలు ముగుస్తాయని తెలిపారు. భారతదేశంలోని 22 సినిమా హాళ్లో, 172 షోకేస్‌లు మరియు 30 స్క్రీన్‌ల ద్వారా సినిమాలను విడుదల చేయనున్నారు. అవి కభీ కభీ, అమర్‌ అక్బర్‌ ఆంథోనీ, నమక్‌హలాల్‌, అభిమాన్‌, దీవార్‌, మిలి, సత్తె పే సత్తా, చుప్కే చుప్కే, డాన్‌, కాలాపత్తర్, మరియు కాలియా లాంటి బ్లాక్‌ బస్టర్‌ సినిమాలను ప్రదర్శించనున్నారు.

బిగ్‌బి సినిమా పండుగ నేపథ్యంలో పీవీఆర్‌ సంస్థ అభిమానుల కోసం పీవీఆర్‌ యాప్‌ ద్వారా టిక్కెట్లు కేవలం రూ.80లకు మాత్రమే కొనుగోలు చేయవచ్చన్నారు. దేశ వ్యాప్తంగా 22 థియేటర్‌లో పీవీఆర్‌ యాప్‌ ద్వారా రూ.400 పాస్‌ను కొనుగోలు చేసి దేశంలో నాలుగు రోజులపాటు రీడిమ్‌ చేసుకోవచ్చన్నారు. మరియు ఎక్కడైనా సినిమా చూసే విధంగా ఏర్పాటు చేశమని తెలిపారు.

ముంబాయిలోని సబర్బన్‌లోని జుహూలోని పీవీఆర్‌ థియేటర్‌లో బచ్చన్‌ స్మారక చిహ్నాల ప్రదర్శనను కూడా ఏర్పాటు చేశారు. ఇందులో అరుదైన పాతకాలపు ఫోటోలు, పోస్టర్‌లు, షూటింగ్‌ స్టిల్స్‌, కమీషన్డ్‌ ఆర్ట్‌ వర్క్‌లు, ఎల్‌పీ జాకెటులు, మ్యాగజైన్‌ కవర్‌ ఫోటోలు, ఏడు అడుగుల భారీ బచ్చన్‌ స్టాండీని కూడా ఏర్పాటు చేయనున్నారు. షాహెన్‌షా మూవీలోని ఫోటోలే కాకుండా కాస్ట్యూమ్‌కు సంబంధించిన వివిధ అరుదైన ఫోటోలను ప్రదర్శనలో ఉంచనున్నారు. వీటి ద్వారా తెర వెనుక ఉన్న బిగ్‌బి చేసిన సహాసోపేతమైన స్టీల్స్‌ను కూడా చూడవచ్చు. వాటికి సంబంధించిన రీల్స్‌ను కూడా ప్రదర్శిస్తారు.

- Advertisement -