సైరాలో బిగ్‌బి రోలేంటీ ?

167
Amitabh Bachchan role in Chiru's 151st film.
Amitabh Bachchan role in Chiru's 151st film.
- Advertisement -

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మెగాస్టార్ చిరంజీవి 151 సినిమా టైటిల్ లోగో, మోషన్ పోస్టర్ ఎట్టకేలకు వచ్చేశాయి. చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఈ రోజు 151వ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలను ప్రకటించేశారు. ముందుగా అనుకున్న ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’కి బదులు ‘సైరా-నరసింహారెడ్డి’ టైటిల్‌ను కన్ఫర్మ్ చేశారు. సురేందర్‌రెడ్డి డైరెక్షన్‌లో తెరకెక్కనున్న ఈ భారీ ప్రాజెక్టులో కీలక తారాగణం స్క్రీన్‌పై కనిపించబోతున్నది. ఈ సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు.

chiru 151st movie first look

తాజాగా ఓ కొత్త వార్త ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతున్నది. సైరా నరసింహారెడ్డి లో అమితాబ్ బచ్చన్ రోల్‌కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుందని, ఉయ్యాల వాడ నరసింహారెడ్డి గురువు పాత్రలో బిగ్ బీ కనిపిస్తారని టాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అంతేకాదు కన్నడ నటుడు కిచ్చా సుదీప్, తమిళ నటుడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతితో పాటు జగపతిబాబు ఇందులో ప్రముఖ పాత్రలు పోషిస్తున్నారు.

స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కనున్న ఈ సినిమా.. కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌పై రామ్‌చరణ్ నిర్మిస్తుండగా..చిరుకు జోడీగా నయనతార నటిస్తోంది. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్.

- Advertisement -