మోడీ…దేశాన్ని నాశనం చేస్తారు!

198
Amit Shah's Translator slip of tongue on Modi
- Advertisement -

కర్ణాటక ఎన్నికల నగారా మోగడంతో ప్రచారంలో మునిగితేలుతున్నాయి ప్రధాన పార్టీలు. ప్రధాన పోరు కాంగ్రెస్,బీజేపీ మధ్య జరగనుండగా ఇప్పటికే ఈ రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం తీవ్రస్ధాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఇప్పటివరకు తన ఎత్తుగడలు,వ్యుహాలతో బీజేపీ విజయంలో కీలకపాత్ర పోషిస్తున్న అమిత్ షా…కర్ణాటకలో మాత్రం తడబడుతున్నారు.

ఇటీవలె కర్ణాటకలో సిద్దరామయ్య సర్కార్‌ అనే బదులు యాడ్యురప్ప సర్కార్‌ తీవ్ర అవినీతిలో కూరుకుపోయిందని వ్యాఖ్యానించి నాలుక కరుచుకున్న బీజేపీ చీఫ్ జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడుతున్నారు. అయితే ఈ సారి ఆయన మాటలను కన్నడలో చెబుతున్న వ్యక్తి తప్పుగా చెప్పడం చర్చనీయాంశంగా మారింది. చీఫ్ తాజాగా మరోసారి టంగ్ స్లిప్‌ అయ్యారు.

దేవనగిరి జిల్లాలోని చల్లకెరెలో చేపట్టిన ర్యాలీలో మాట్లాడిన అమిత్ షా…సిద్ధరామయ్య ప్రభుత్వం కర్ణాటకను అభివృద్ధి చేయలేదు. ప్రధాని మోడీపై మీకు నమ్మకముంటే… యడ్యూరప్పకే ఓటేయండి. దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా కర్ణాటకను తీర్చిదిద్దుతాం అని పిలుపునిచ్చారు. ఆయన ప్రసంగాన్ని కన్నడలో ట్రాన్స్ లేట్ చేస్తున్న ప్రహ్లాద్‌ జోషి- ళితులకూ, పేదలకూ, వెనుకబడినవర్గాల వారికీ ప్రధాని మోడీ ఏమి చేయరంటూ స్టేట్ మెంట్ ఇచ్చేశారు.

మోడీ దేశాన్ని నాశనం చేస్తారు అంటూ పొరపాటుగా చెప్పారు. దీంతో ఒక్కసారిగా స్టేజ్ మీద ఉన్న నేతలు అవాక్కయ్యారు. అసలే ఎన్నికల సమయం…ఏమాత్రం నోరుజారిన భారీ ముల్యం చెల్లించుకోక తప్పదు. ఇదే ప్రధాన అస్త్రంగా వాడుకుంటూ కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో బీజేపీని ఎద్దేవా చేస్తోంది.

- Advertisement -