అభివృద్ధి పథంలో పాలమూరు..

203
KTR Inaugurates Double Bedroom House In Mahabubnagar
- Advertisement -

పాలమూరు ప్రజల రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత మాపై ఉందని తెలిపారు మంత్రి కేటీఆర్. మదనాపురంలో డబుల్ బెడ్ రూం ఇళ్లకు శంకుస్ధాపన చేసిన కేటీఆర్ పాలమూరు ఎంపీగానే కేసీఆర్ తెలంగాణ సాధించారని తెలిపారు. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి గిరిజనుల దశాబ్దల కల నేరవేర్చిన ఘనత టీఆర్‌ఎస్‌ది అన్నారు.

టీడీపీ,కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఆగమైందన్నారు. కానీ నేడు స్వరాష్ట్రంలో తెలంగాణ అన్నిరంగాల్లో అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. నాలుగేళ్ల టీఆర్ఎస్ పాలనలో పాలమూరు అభివృద్ధిలో ముందంజలో ఉందన్నారు. ప్రాజెక్టులతో పాలమూరు పచ్చబడాలన్నదే కేసీఆర్ అభిమతమన్నారు.

పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్‌లు ఇస్తామని స్పష్టం చేశారు. ఎండిపోయిన పాలమూరు గొంతులో మంచినీళ్లు ఇచ్చే ప్రయత్నం చేస్తూంటే కాంగ్రెస్ నేతలు అడ్డుపడుతున్నారని తెలిపారు. కాంగ్రెస్‌ను తెలంగాణ నుంచి తరిమికొట్టాలన్నారు. ఇంటింటికీ నీళ్లు ఇచ్చే బృహత్తర కార్యక్రమం మిషన్ భగీరథకు శ్రీకారం చుట్టామన్నారు.

కొల్లాపూర్‌లో అభయారణ్యం ఉందని పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకునేందుకు కోర్టు కేసులు వేస్తున్నారని తెలిపారు. మరో 20 ఏండ్లు తెలంగాణలో టీఆర్ఎస్‌ అధికారంలో ఉంటుందన్నారు. ఈ జిల్లా నుంచి జాతీయస్ధాయిలో మంత్రిపదవులు దక్కించుకున్నా ఒరగబెట్టిందేమి లేదన్నారు. పాలమూరు జిల్లాలో ఆరున్నర లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చామన్నారు.

సంక్షేమంలో తెలంగాణ నెంబర్‌ 1గా నిలిచిందన్నారు. అన్నివర్గాల సంక్షేమం,అభివృద్ధే లక్ష్యంగా అవినీతి రహిత పాలన అందిస్తున్నామని చెప్పారు. షాది ముబారక్,కల్యాణ లక్ష్మీ పథకాలతో సీఎం కేసీఆర్ పేదవారి కుటుంబాలకు పెద్దన్నగా మారాడాని తెలిపారు. డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం నిరంతరాయంగా కొనసాగుతుందన్నారు. ఒక్క పైసా లబ్దిదారుల నుంచి తీసుకోకుండా ఇళ్ల నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు. కేసీఆర్ సీఎం కావడం తెలంగాణ ప్రజల అదృష్టమన్నారు.

- Advertisement -