అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన అంబటి రాయుడు

388
Ambati Raydu
- Advertisement -

తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. అన్ని ఫార్మట్ల నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపాడు. ఇంగ్లాండ్ లో జరుగుతున్న ప్రపంచకప్ టోర్నీకి తనను ఎంపిక చేయకుండా మయాంక్ అగర్వాల్ ను ఎంపిక చేయడం పట్ల తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తుంది.

ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో సాంబశివరావు, విజయలక్ష్మి దంపతులకు రాయుడు 1985, సెప్టెంబర్ 23న జన్మించాడు. 2001-02లో రంజీ టోర్నీలో హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 2005-06 రంజీ సీజన్ లో ఏపీ తరఫున ఆడాడు. 2003-04 అండర్ 19 ప్రపంచకప్ లో భారత జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించాడు.

2015 ప్రపంచకప్ తుదిజట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇప్పటివరకూ 55 వన్డేలు ఆడిన రాయుడు 47.06 సగటుతో 1694 పరుగులు చేశాడు. వన్డేల్లో అత్యధికంగా 124 స్కోర్ నమోదుచేశాడు. ఇక ఐపీఎల్ లో 147 మ్యాచ్ లు ఆడిన రాయుడు 3,300 పరుగులు చేశాడు.

- Advertisement -