అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ అన్‌లైన్ సంస్థలు పోటాపోటీగా ఆఫర్లను ప్రకటించాయి. సేవింగ్స్ డేస్ పేరుతో భారీ డిస్కౌంట్లు, ఆఫర్లకు తెరతీశాయి. తాజాగా అమెజాన్ మరో ప్రత్యేక సేల్‌ను ప్రకటించింది. స్మార్ట్‌ఫోన్లపై 40 శాతం వరకు డిస్కౌంట్, నోకాస్ట్ ఈఎంఐ, ఫ్రీ డెలివరీ వంటి ఆఫర్లను అందిస్తోంది. మొబైల్ సేవింగ్స్ డేస్ పేరుతో నిర్వహిస్తున్న ఈ సేల్ ప్రస్తుతం కస్టమర్లకు అందుబాటులో ఉంది. ఈ సేల్ జూన్ 12 వరకు ఉంటుంది.
మరోవైపు ఫ్లిప్‌కార్ట్ కూడా బిగ్ సేవింగ్ డేస్ పేరుతో నిర్వహించనున్న సేల్ ఈనెల 13 నుంచి 16 వరకు కొనసాగనుంది. స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్‌లు, ల్యాప్‌టాప్‌లు, వేరబుల్ డివైజ్‌లు, ఎలక్ట్రానిక్ పరికరాలపై భారీ ఆఫర్లు, డీల్స్, డిస్కౌంట్లను అందించనుంది. ఎస్‌బీఐ కార్డు ద్వారా షాపింగ్ చేసే వినియోగదారులకు 10శాతం ఇన్‌స్టాంట్ తగ్గింపును అందిస్తుంది.
అమెజాన్‌లో ఎంపిక చేసిన స్మార్ట్‌ఫోన్లను హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కార్డుతో కొనుగోలు చేస్తే రూ.1000 వరకు ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ పొందవచ్చు. రియల్‌మీ, శాంసంగ్, వివో, షియోమీ వంటి బ్రాండ్లకు చెందిన స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్లు, డిస్కౌంట్లు అందిస్తున్నది. ఒప్పో F17పై రూ.1,750 డిస్కౌంట్‌తో పాటు కూపన్‌పై అదనంగా రూ.1,000 తగ్గింపుతో కొనుగోలు చేయొచ్చు.