కలబంద మన అనుబంధం…

213
- Advertisement -

కలబంద అనేది ఎన్నో ఆరోగ్య సమస్యలకు చక్కటి పరిష్కారం చూపించగలదు. ఔషధాల తయారీలో సౌందర్య లేపనాలు తయారు చేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నది. కలబందలో 75రకాల విటమిన్స్ ఉండటం వల్ల శరీరంపై చర్మమే కాకుండా శరీరంలో ఉండే వివిధ అవయవాలకు కూడా ఔషదిగా పనిచేస్తుంది.

ప్రస్తుత అధునిక కాలంలో చర్మ సంరక్షణ కోసం మార్కెట్లోకి వస్తున్న వివిధ ప్రాడక్ట్స్‌ కోసం ప్రజలు విచ్చలవిడిగా ఖర్చు చేస్తుంటారు. అలా కాకుండా మన ఇంటి పెరట్లో కలబందను నాటుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అవి ఎంటో చూద్దామా…

చర్మాన్ని తేమగా మరియు ఆరోగ్యంగా ఉంచే సహజ పదార్ధాలలో అలోవెరా చాలా ఉత్తమమమైనది. అధిక మొత్తంలో కలబంద ఉన్న కాస్మొటిక్స్ చర్మాన్ని మెరుగ్గా, ఎక్కువకాలం తేమగా కూడా ఉంచుతాయి.

పొడిబారిన చర్మాన్ని బాగు చేయడానికి కూడా కలబంద ఉపయోగపడుతుంది .

కలబందను మొటిమలు, మచ్చలు, స్ట్రెచ్ మార్క్స్ (చర్మపు చారలు) తగ్గించడానికి కూడా ఉపయోగించవచ్చు .

కలబందను తరచుగా తీసుకోవడం వల్ల ముఖంపై ముడతలు బాగా తగ్గుతాయి . కలబందను ప్రతీ రోజు తీసుకున్న వారిలో మూడు నెలల తరువాత, మఖంపై ముడతలు తగ్గి చర్మం మృదువుగా కూడా మారుతుంది.

Also Read:TTD:తిరుమలకు పోటెత్తిన భక్తులు

కలబంద యొక్క ప్రధాన ప్రయోజనాల్లో గాయాలను తగ్గించడం ఒకటి. ఫైబ్రోబ్లాస్ట్స్ విస్తరణను ప్రోత్సహించడం ద్వారా ఇది వైద్య ప్రక్రియను వేగవంతం కూడా చేస్తుంది .

కలబంద గజ్జిని కూడా నయం చేస్తుంది. గజ్జి చికిత్సలో కలబంద బెంజైల్ బెంజోయేట్ లాగా ప్రభావవంతంగా ఉంటుందని ఒక అధ్యయనంలో కూడా కనుగొన్నారు .

కలబంద రేడియేషన్ వల్ల ఏర్పడే చర్మపు ఇబ్బందులను నయం చేస్తుంది . అధిక-స్థాయి రేడియేషన్ చికిత్స పొందిన వారికి కలబంద ఎక్కువ ప్రభావవంతంగా కూడా పనిచేస్తుంది.

చుండ్రు సమస్యను నివారించడానికి అలోవెరా (కలబంద) చాలా బాగా పనిచేస్తుంది. కలబందలో ఉండే పెక్టిన్ తలలో కొత్త కణాలను మరియు కణజాలాలను ఉత్తత్తి చేయడానికి, జుట్టును శుభ్రంగా మరియు మెత్తగా చేయడానికి గొప్పగా కూడా సహాయపడుతుంది.

Also Read:సీతగా సాయిపల్లవి.. రావణుడిగా ఎన్టీఆర్

త‌ర‌చూ విరేచ‌నాల సమ‌స్యతో బాధ‌డేవారు క్రమం త‌ప్పకుండా క‌ల‌బంద గుజ్జును తీసుకుంట‌నే మంచి ఫ‌లితం ల‌భిస్తుంది.

- Advertisement -