కేరళ అడవుల్లో అల్లు అర్జున్ ‘పుష్ప’..

18
Allu Arjun

టాలీవుడ్‌ హీరో అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ మూవీతో భారీ విజయం అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తరువాత సుకుమార్‌ డైరెక్షన్‌లో ‘పుష్ప’ మూవీలో నటిస్తున్నాడు. అల్లు అర్జున్ సరసన రష్మిక కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఈ క్రమంలో ఇప్పటికే కొన్ని బాణీలను కూడా ఆయన సిద్ధం చేసినట్టు చెబుతున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ మూవీ ఉండనుంది. ఈ చిత్ర షూటింగ్ మరోసారి వాయిదాపడినట్టు తాజాగా సమాచారం.

ఈ చిత్రం షూటింగును ముందుగా కేరళ అడవులలో చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అదేసమయంలో కరోనా లాక్ డౌన్ విధించడంతో షూటింగ్‌ అగిపోయింది. ఇక పరిస్థితులు ఇప్పట్లో కుదుటపడవని భావించి ఈ చిత్రం షూటింగును మహబూబ్ నగర్ అడవుల్లో చేద్దామని అంతా సిద్ధం చేసుకున్నారు.తక్కువ మంది యూనిట్ సభ్యులతో.. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ అక్కడ షూటింగ్ చేద్దామని ప్లాన్ చేసుకున్నప్పటికీ,ఆ ప్రయత్నాన్ని ఇప్పుడు విరమించుకున్నట్టు తెలుస్తోంది.మొదట్లో అనుకున్నట్టుగా కాస్త ఆలస్యమైనా కేరళ అడవుల్లోనే చేయాలని నిర్ణయించుకున్నారట. దీంతో డిసెంబర్ నుంచి కేరళ అడవుల్లో షూటింగ్ నిర్వహిస్తారని సమాచారం.