25న ఎన్సీబీ విచారణకు రకుల్..

145
Rakul Preet Singh

టాలీవుడ్ హీరోయిన్‌ రకుల్ ప్రీత్ సింగ్ ను ఎన్సీబీ అధికారులు శుక్రవారం విచారించనున్నారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు కాస్తా ఇప్పుడు అనేక మలుపులు తిరిగి తిరిగి చివరికి డ్రగ్స్ వ్యవహారం దగ్గర వచ్చి ఆగింది. మరీ ముఖ్యంగా రియా చక్రవర్తిని విచారించిన తర్వాత చాలా సంచలన విషయాలు బయటికి వచ్చాయి.

ఈ విచారణలో రియా పలువురు తారల పేర్లు బయటపెట్టింది. ఈ క్రమంలోనే ఎన్సీబీ అధికారులు దీపిక పదుకొనే, రకుల్ ప్రీత్ సింగ్, శ్రద్ధా కపూర్, సారా అలీఖాన్ లకు సమన్లు పంపారు. దీనిపై ఎన్సీబీ స్పందిస్తూ, రకుల్ ప్రీత్ సింగ్ 25న విచారణకు హాజరవుతున్నారని వెల్లడించింది. రకుల్ తో సహా,సారా, దీపికా పదుకొనే, కరిష్మా ప్రకాశ్ కూడా విచారణకు వస్తున్నారని వివరించింది.

ఫ్యాషన్ డిజైనర్ సైమన్ ఖంబట్టా ఇప్పటికే విచారణకు వచ్చారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ శృతి మోదీ తర్వాత సైమన్‌ను విచారించారు నార్కోటిక్స్ అధికారులు. ఇక రకుల్ కూడా మరికొన్ని గంటల్లో అధికారుల ముందుకు రాబోతుంది. మరి అక్కడ ఇంకెన్ని సంచలన విషయాలు బయటికి వస్తాయనేది చూడాలి.