స్నేహా విషయంలో టెన్షన్ పడ్డా: అల్లు అర్జున్

51
sneha

అక్కినేని సమంత హోస్ట్‌గా సామ్ జామ్ షో ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు సెలబ్రెటీలు ఈ కార్యక్రమంలో సందడి చేయగా తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ సమంతతో కలిసి సందడి చేశారు. ఇప్పటికే పలు ప్రొమోల ద్వారా ఎపిసోడ్‌పై అంచనాలను పెంచేయగా అంచనాలను తగ్గట్టుగానే తన మనసులోని మాటలను బయట పెట్టారు బన్నీ.

తన భార్య అల్లు స్నేహారెడ్డి గురించిన ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తనది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని తెలిపిన బన్నీ…తొలిసారి స్నేహాను నైట్ క్లబ్‌లో చూశానని తెలిపాడు. తన ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేస్తున్న స్నేహా,ఆ సమయంలో ఎంతో డిగ్నిటీగా అనిపించిందన్నారు. అర్దరాత్రి దాటి రెండు గంటలు అవుతున్నా ఏ మాత్రం వల్గర్‌గా అసభ్యకరంగా కనిపించలేదని, అదే ఆమెలో బాగా నచ్చిందని బన్నీ తన శ్రీమతి గురించి ఎంతో గొప్పగా చెప్పుకొచ్చాడు.

ఈ విషయాన్ని ఇప్పటివరకు ఎవరితో పంచుకోలేదని తెలిపిన బన్నీ…తనకు ప్రపోజల్ చేసినప్పుడు ఒప్పుకుంటుందో లేదోనని టెన్షన్ పడ్డానని తెలిపి సర్‌ప్రైజ్ ఇచ్చారు.