నిలకడగా గంగూలీ ఆరోగ్యం!

58
ganguly

బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు ఉడ్‌లాండ్స్ ఆస్పత్రి డాక్టర్లు. గంగూలీ ఆరోగ్యంపై చర్చించడానికి 9మంది వైద్యనిపుణులతో కూడిన మెడికల్ బోర్డు ఇవాళ సమావేశం కానుంది. సౌరవ్‌కు తదుపరి చికిత్స ప్రణాళికపై దాదా కుటుంబసభ్యులతో చర్చించనున్నారు.

గంగూలీకి ఎప్పటికప్పుడు ఈసీజీ పరీక్షలు నిర్వహించామని… వైద్యుల బృందం ఆయనను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్టు ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. రాత్రి జ్వరం లాంటి లక్షణాలేవీ కనిపించలేదని, ప్రస్తుతం నిద్రపోతున్నారని తెలిపాయి.

శనివారం గంగూలీ తన ఇంట్లోని వ్యాయామశాలలో శారీరక వ్యాయామం చేస్తున్నపుడు ఛాతీ నొప్పి, తల బరువు, వాంతులు, మైకంతో ఆసుపత్రిలో చేరారు. వైద్యులు గంగూలీకి యాంజియోప్లాస్టీ చేసి ఓ స్టెంట్‌ వేసిన సంగతి తెలిసిందే.