బన్నీ – సుకుమార్‌ మూవీ అప్‌డేట్ వచ్చేసింది..!

241
allu arjun

సుకుమార్- అల్లు అర్జున్ కాంబోలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి అప్‌డేట్‌ ఏప్రిల్ 8(రేపు) ఇవ్వనున్నట్లు ప్రకటించింది చిత్రయూనిట్. ఈ మేరకు ట్విట్టర్‌లో ట్వీట్ చేసిన మైత్రీ మూవీ మేకర్స్ ఏమబ్బా,అందరూ బాగుండారా మీరు ఎప్పుడెప్పుడా అని చూస్తుండే AA20కి సంబంధించిన అప్ డేట్ రేపు రానుందని ప్రకటించింది. ఏప్రిల్ 8న తెల్లార్తో 9 గంటలకు వస్తాండాది…రెడీ కాండబ్బా అంటూ తెలిపింది మైత్రీ మూవీ మేకర్స్..

ఈ మూవీలో బన్నీ లారీ డ్రైవర్ పాత్రలో కనిపించనున్నాడు. ‘శేషాచలం’ అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. ఈమూవీలో బన్నికి జోడిగా రష్మిక మందన నటించనుంది.

ఇటీవలె త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన అల..వైకుంఠపురంలోతో భారీ విజయాన్ని సాధించాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. బన్నీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. బన్ని, త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఆర్య, ఆర్య2 సినిమాలు తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ రెండు మూవీలో మంచి విజయం సాధించాయి. ఈమూవీతో బన్నితో సుకుమార్ హ్యాట్రిక్ కొడతాడో లేదో చూడాలి మరి.