సఫాయన్నా నీకు సలాం: మాజీ ఎంపీ కవిత

198

వైద్య సిబ్బంది, పారిశుధ్య కార్మికులకు సీఎం కేసీఆర్‌ ప్రోత్సాహం ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు మాజీ ఎంపీ కవిత. ఈ మేరకు ట్విట్టర్‌లో ట్వీట్ చేసిన కవిత…సఫాయన్న నీకు సలాం అన్నా అని పేర్కొన్నారు.

కరోనాను నియంత్రించేందుకు కార్మికులు చేస్తున్న సేవకు సీఎం చేతులు జోడించి నమస్కరించారని ఇది కార్మికుల పట్ల ఆయనకు ఉన్న చిత్తశుద్దికి నిదర్శనమని పేర్కొన్నారు కవిత.

కరోనా నియంత్రణ చర్యల్లో అవిశ్రాంతంగా పోరాటం చేస్తున్న వైద్య,పారిశుధ్య సిబ్బందికి సీఎం గుడ్ న్యూస్ అందించిన సంగతి తెలిసిందే. వైద్య సిబ్బందికి పూర్తి జీతంతో పాటు సాలరీలో 10 శాతం గిఫ్ట్‌గా ప్రకటించారు.

ఇక పారిశుధ్య కార్మికులకు కూడా పూర్తి స్ధాయి వేతనాన్ని ప్రకటించారు. సీఎం ప్రోత్సాహం కింద జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ కార్యకర్తలకు రూ. 7,500 ,మున్సిపల్‌ మున్సిపల్‌, గ్రామపంచాయతీ పారిశుద్ద్య కార్మికులకు రూ. 5 వేలు ఇస్తాం అని ప్రకటించారు.

kcr kcr