వరుడు కావలెను అతిథిగా పుష్పరాజ్..!

38
varudu kavalenu

టాలీవుడ్‌ యంగ్‌ హీరో నాగశౌర్య కథానాయకుడిగా సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం ‘వరుడు కావలెను’. లక్ష్మి సౌజన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగశౌర్య సరసన రీతూ వర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్‌, టీజర్‌కు మంచి స్పందనరాగా సాంగ్స్‌కు అయితే ఊహించని రెస్పాన్స్ వచ్చింది. అక్టోబర్ 29న సినిమా విడుదల కానుండగా సెన్సార్ ఫార్మాలిటిస్‌ను పూర్తి చేసుకుని యూ/ఏ సర్టిఫికేట్ పొందింది.

ఈ నెల 27న ‘వరుడు కావలెను’ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగనుండగా గెస్ట్ గా రానున్నారు బన్నీ. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. గత సినిమాలతో ప్లాప్స్ చవిచూసిన నాగ శౌర్య ఈ సినిమాతోనైనా హిట్ ని అందుకుంటాడో వేచిచూడాలి.