సర్కారు వారి సెట్లో నమ్రత

39
namratha

సూపర్‌ స్టార్ మహేష్‌ బాబు హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘సర్కారు వారి పాట’. కీర్తీ సురేశ్‌ హీరోయిన్‌ నటిస్తోంది. పరుశరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ వారు నిర్మిస్తుండగా మహేష్‌ బాబు కూడా భాగస్వామిగా ఉన్నాడు. జనవరి 13న సినిమా రిలీజ్ కానుండగా ప్రస్తుతం చివరి షెడ్యూల్‌ స్పెయిన్‌లో జరుగుతోంది.

కొన్ని రోజులుగా చిత్రీకరణ జరుగుతుండగా ఈ సినిమా సెట్స్ లో నమ్రత సందడి చేసింది. ఈ సినిమా పాట షూటింగు పూర్తయిన తరువాత ఆమె అక్కడ కీర్తి సురేశ్ తో కలిసి సరదాగా మాట్లాడి అందరిలో జోష్ నింపింది.

నమ్రత ఏదో విషయం మాట్లాడుతూ ఉంటే, కీర్తి సురేశ్ నవ్వుతూ వింటున్నట్టుగా ఈ ఫొటోలో కనిపిస్తోంది. వెన్నెల కిషోర్ తో పాటు మిగతా యూనిట్ సభ్యులు అక్కడ కనిపిస్తున్నారు. హైదరాబాద్ లో జరిగే షెడ్యూల్ తో ఈ సినిమా షూటింగు పార్టు పూర్తికానుండగా త్వరలోనే ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.