గ్యాప్ ఇవ్వలా అలా..వచ్చిందిఃబన్నీ

411
Ala Vaikuntapuramlo

అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈసినిమాకు అల.. వైకుంఠపురంలో అనే టైటిల్ ను ఖారారు చేశారు. ఆగస్ట్ 15 సందర్భంగా టైటిల్ కు సంబంధించిన టీజర్ ను విడుదల చేశారు చిత్రయూనిట్. టైటిల్ ను చూస్తుంటే త్రివిక్రమ్ అ సెంటిమెంట్ ను మాత్రం వదలడం లేదని అర్ధం అవుతుంది.

టైటిల్ తో పాటు బన్నీ, మురళీ శర్మకు సంబంధించిన చిన్న డైలాగ్ ను కూడా ఈ టీజర్లో కట్ చేశారు. ఎంట్రోయ్ గ్యాప్ ఇచ్చావ్ అంటే.. ఇవ్వలేదు.. వచ్చింది.. అని చెప్పే డైలాగ్ ఉంటుంది. త్రివిక్రమ్ మార్క్ పంచ్ డైలాగులు సినిమాలో భారీగా ఉంటాయని అర్ధం అవుతున్నది.

ఈసినిమాలో బన్నీ సరసన పూజా హెగ్డె కథానాయికగా నటించగా.. సుశాంత్, నివేదా పెతురాజ్‌, ట‌బు ప్ర‌ధాన పాత్ర‌ల‌లో సంద‌డి చేయ‌నున్నారు.ఈసినిమా తండ్రీ కొడుకుల సెంటిమెంట్ తో రూపొందుతుంద‌ని తెలుస్తుంది. హారికా హాసిని క్రియేషన్స్‌, గీతా ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈసినిమాను 2020సంక్రాంతికి విడుదల చేయనున్నారు.