నటుడు అల్లరి నరేష్‌ నాయనమ్మ మృతి..

254

దివంగత సినీ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ తల్లి,నటుడు అల్లరి నరేష్‌ నాయనమ్మ ఈదర వెంకటరత్నమ్మ నిడదవోలు మండలం కోరుమామిడిలో కన్నుమూశారు. ఆమె వయసు 87 సంవత్సరాలు. కుమారుడు మరణించినప్పటి నుంచి కోరుమామిడిలోనే నివసిస్తున్న ఆమె, వృద్ధాప్య కారణాలతో మరణించినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.

Allari Naresh Grandmother

అల్లరి నరేశ్, ఆర్యన్ రాజేశ్ తమ నాయనమ్మ మృతి వార్త తెలుసుకుని హుటాహుటిన గ్రామానికి చేరుకుని దగ్గరుండి అంత్యక్రియలు జరిపించారు. వీరితోపాటు దర్శకుడు ఈవీవీ సత్తిబాబు, నిర్మాత కానుమిల్లి అమ్మిరాజు, సరిదే బాలు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఈదర వెంకట్రావు, వెంకరత్నమ్మ దంపతులకు ఈవీవీ సత్యనారాయణ, గిరి, శ్రీనివాస్‌ ముగ్గురు కుమారులుండగా, కుమార్తె ముళ్లపూడి మంగ ఉన్నారు. పలువురు సినీ ప్రముఖులు, గ్రామపెద్దలు వెంకటరత్నమ్మ మృతికి సంతాపం వ్యక్తం చేశారు.