టీటీడీ ఛైర్మన్‌గా మోహన్ బాబు..!

399
jagan
- Advertisement -

సినీనటుడు మోహన్ బాబు చిరకాల వాంఛ నేరవేరనుందా..?త్వరలోనే ఆయన టీటీడీ పగ్గాలు చేపట్టనున్నారా..? అంటే అవుననే అంటున్నాయి వైసీపీ శ్రేణులు. ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన మోహన్ బాబు ..చంద్రబాబుపై తీవ్రస్ధాయిలో మండిపడ్డారు. బాబు చేసిన మోసాలను ప్రజలకు వివరించారు.

తిరుపతికి చెందిన మోహన్ బాబు…ఏపీకి కాబోయే సీఎం జగన్‌కు బంధువు కూడా. ఈ నేపథ్యంలో పార్టీలో చేరిన ఆయనకు టీటీడీ ఛైర్మన్ పదవిని కట్టబెట్టనున్నారట. ఇందుకు సంబంధించి జగన్‌ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

మోహన్ బాబు గా తిరుపతి వాస్తవ్యుడు కావడంతో పాటు, ఆయనకు అక్కడ పలు విద్యాసంస్థలు ఉన్నాయి. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారనే పేరుంది. దీనికి తోడు గతంలో రాజ్యసభ ఎంపీగా బాధ్యతలు చేపట్టిన అనుభవం కూడా ఉండటంతో ఆయనను టీటీడీ ఛైర్మన్‌గా నియమించనున్నారట జగన్‌.

ప్రస్తుతం మోహన్ బాబు హైదరాబాద్‌లోని ఫిలింనగర్ దైవసన్నిధానం ఆలయం చైర్మన్‌గా కొనసాగుతున్నారు. ఫిలింనగర్ దైవసన్నిధానం విశాఖ శ్రీ శారదా పీఠం ఆధ్వర్యంలో ఉంది. విశాఖ శారదాపీఠం స్వామీజీ, జగన్ మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలు మోహన్ బాబును టీటీడీ ఛైర్మన్‌ పదవి దక్కేలా చేయడంలో మరింత సాయం చేసిందని సన్నిహిత వర్గాల సమాచారం.

- Advertisement -