ఇవాళే ఇందూరు సమరభేరీ..

276
trs
- Advertisement -

రెండో విడత ఎన్నికల ప్రచారానికి నేటి నుంచి శ్రీకారం చుట్టనుంది టీఆర్ఎస్ పార్టీ. 105 మంది అభ్యర్థులతో తొలిజాబితాను ప్రకటించిన కేసీఆర్..ప్రచారంలో దూకుడు పెంచారు. హుస్నాబాద్ సభ అందించిన జోష్‌తో నేటి నుంచి 5 జిల్లాల్లో భారీ బహిరంగసభలను నిర్వహించనుంది. ఇవాళ నిజామాబాద్ జిల్లా ఇందూరులో జరిగే బహిరంగసభలో సీఎం కేసీఆర్ పాల్గొని మాట్లాడనున్నారు.

ఇందూరు గిరిరాజ్ కాలేజీ మైదానంలో జరిగే బహిరంగ సభకు ఇప్పటికే ఏర్పాట్లన్ని పూర్తయ్యాయి. ఎక్కడచూసినా గులాబీ తోరణాలు,కేసీఆర్ కటౌట్లతో ఇందూరు గులాబీమయమైంది. లక్షలాది మందిని బహిరంగసభకు తరలివచ్చేలా ఏర్పాట్లు చేశారు. బహిరంగసభ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించిన ఎంపీ కవిత ప్రజలు స్వచ్ఛందంగా జరిగిరావాలని పిలుపునిచ్చారు.

ఆడబిడ్డలు, రైతన్నలు కదలిరావాలన్నారు ఎంపీ కవిత. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో, తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని ప్రత్యక్షంగా వివరించడానికి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అభివృద్దికి ఏం చేశామో చెప్పడానికి ముఖ్యమంత్రి వస్తున్నారని కవిత తెలిపారు. యావత్ దేశం తెలంగాణ ప్రభుత్వ పనితీరును మెచ్చుకుందన్నారు. రాష్ట్ర ప్రగతిని కాంగ్రెస్ అడుగడుగునా అడ్డుకుంటున్నందుకే సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నట్టు చెప్పారు.

ఇందూ రు సభ తర్వాత.. 4న నల్లగొండలో, 5న వనపర్తిలో, 7న వరంగల్‌,8న ఖమ్మం జిల్లాల్లో ప్రజాఆశీర్వాద సభల్లో సీఎం పాల్గొని ప్రసంగించనున్నారు.

Sabha

- Advertisement -