తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికలు..

288
ec schedule
- Advertisement -

సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలకు రంగం సిద్ధమైంది. ఈ నెల 12లోపు ఎప్పుడైన ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. లోకసభ ఎన్నికలతో పాటు ఆంధ్ర ప్రదేశ్, సిక్కిం, ఒడిస్సా, అరుణాచల్ ప్రదేశ్ నాలుగు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. 7 లేదా 8 దశల్లో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది.

అయితే తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికలు జరగనున్నట్లు తెలుస్తోంది. పాటే వీటి షెడ్యూల్ కూడా విడుదల కానుంది.రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్ 15న పోలింగ్ ఉందని సమాచారం. ఇప్పటికే ఎన్నికల జరిపించేందుకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయని ఈసీ ప్రకటించిన నేపథ్యంలో ప్రచారంలో తలమునకలయ్యాయి ప్రధాన రాజకీయ పార్టీలు. సంగతి తెలిసిందే.

2014లో మార్చి 5న షెడ్యూల్ రాగా, తెలంగాణలో ఏప్రిల్‌ 30న, ఏపీలో మే 7న పోలింగ్‌ జరిగింది. అయితే ఈసారి మాత్రం ఏపీ,తెలంగాణలో ఒకేసారి ఎన్నికలు జరగనున్నట్లు తెలుస్తోంది.

ఇక ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం ఉపందుకుంది. టీఆర్ఎస్ అందరికంటే ముందు ప్రచారాన్ని ప్రారంభించగా ఇవాళ కాంగ్రెస్‌ చేవెళ్లలో రాహుల్ గాంధీతో సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. బీజేపీ సైతం నిజామాబాద్ నుండి ఎన్నికల శంఖారావాన్ని పూరించింది. మొత్తంగా ఎన్నికల షెడ్యూల్‌ విడుదలకు టైం దగ్గరపడుతున్న కొద్ది పొలిటికల్ హీట్ తారస్ధాయికి చేరుతోంది.

- Advertisement -