లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌..బాలకృష్ణకి అంకితం:ఆర్జీవీ

266
rgv ntr biopic
- Advertisement -

ప్రతి ఆలోచన వెనుక ఓ స్పూర్తి ఉంటుంది…లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తీయడానికి తనకు స్పూర్తి నందమూరి బాలకృష్ణ అని తెలిపారు దర్శకుడు ఆర్జీవీ. మార్చి 22న సినిమా ప్రేక్షకుల ముందుకురానుండగా సినిమా ప్రమోషన్‌లో భాగంగా హైదరాబాద్‌లో ట్రైలర్‌ రిలీజ్ కార్యక్రమం ఘనంగా జరిగింది.

ఈ సందర్భంగా మాట్లాడిన ఆర్జీవీ..లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమాని బాలకృష్ణకు అంకితం చేస్తున్నానని తెలిపారు. ఈ సినిమా తనకు చాలా ప్రత్యేకమైందని తెలిపారు. సినిమాలో చూపించిన సంఘటన మీద అంత అవగాహన లేదని…టీడీపీలో సంక్షోభం తలెత్తిన సమయంలో తాను ముంబైలో ‘రంగీలా’ తీస్తున్నానని తెలిపారు.

ఎన్టీఆర్ బయోపిక్‌ కోసం నిజాన్ని కనుక్కొనే ప్రయత్నం చేశానని తెలిపారు. ఒక బయోపిక్‌ తీయడానికి కావల్సింది నిజాయతీ. ఆ నిజాయతీతోనే లక్ష్మీస్ ఎన్టీఆర్‌ సినిమా చేశానని తెలిపారు.

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాతో తనకు మనశ్శాంతి దొరికింది అని రామ్‌గోపాల్‌ వర్మకి నా జీవితాంతం రుణపడి ఉంటానని తెలిపారు లక్ష్మీపార్వతి. 23 ఏళ్లుగా ఎన్నో అవమానాల్ని గుండెల్లో పెట్టుకొని కుమిలిపోతూ వచ్చిందన్నారు. ఎవరు న్యాయం చేస్తారని ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితుల్లో ఆర్జీవీ రూపంలో న్యాయదేవత ప్రత్యక్షమైనట్టు అనిపించిందని తెలిపారు. .

- Advertisement -