డిసెంబర్‌ నాటికి అందరికీ టీకాలు: గజేంద్రసింగ్‌ షెకావత్

176
vaccine
- Advertisement -

డిసెంబర్ నాటికి అందరికీ టీకాలు అందజేస్తామన్నారు కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్. కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న టీకా డ్రైవ్‌ను రాజకీయం చేసేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు.

కొవిడ్‌ వ్యాక్సిన్ల ఉత్పత్తి పెంచేందుకు భారత్‌ వేగంగా కృషి చేస్తోందని…చరిత్రలో మొదటిసారిగా భారతదేశం ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు సమాంతరంగా కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు టీకాలను అభివృద్ధి చేసిందన్నారు. దేశంలో అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ల నాణ్యత, ప్రామాణికతను ప్రశ్నిస్తూ టీకా డ్రైవ్‌ను రాజకీయం చేసేందుకు ప్రతిపక్షాలు తమవంతు కృషి చేశాయని విమర్శించారు.

దేశం ఇప్పటికే నెలకు 1.5 కోట్ల రెమ్‌డెసివిర్‌ ఉత్పత్తి అవుతోందని, ఆంఫోటెరిసిన్‌-బీ ఇంజెక్షన్ల అవసరాన్ని తీర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. దేశంలో ఆరు ఫార్మా కంపెనీలు ఆంఫోటెరిసిన్‌ను ఉత్పత్తి చేస్తున్నాయని, మరో ఐదు కంపెనీలకు ఉత్పత్తి చేసేందుకు అనుమతి ఇచ్చినట్లు మంత్రి వివరించారు.

- Advertisement -